• Neti Charithra

బాణసంచా పేలుడు...కుప్ప కూలిన భవనం.. ఆరుగురు మృతి!

#బాణసంచా పేలుడు...కుప్ప కూలిన భవనం.. ఆరుగురు మృతి!

ల‌ఖ్‌న‌వూ : నేటి చరిత్ర (సెప్టెంబర్21) ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలోని ఓ బాణ‌సంచా త‌యారీ కేంద్రంలో శ‌నివారం సాయంత్రం పేలుడు సంభ‌వించింది. ఈ పేలుడు ధాటికి భ‌వ‌నం కుప్ప‌కూలిపోయింది. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రికొంద‌రు గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం. ఆగ్రాకు 100 కి.మీల దూరంలో ఏత్ జిల్లాలోని మిరేచి ప‌ట్ట‌ణంలో టాకియా ప్రాంతంలో ఈఘ‌ట‌న చోటుచేసుకుంది. అక్ర‌మంగా ఓ ఇంట్లో బాణ‌సంచా ప‌రిశ్ర‌మ‌ను నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈమేర‌కు ఘ‌ట‌నా స్థ‌లంలో స‌హాయక చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని పోలీసులు తెలిపారు. శిథిలాల క్రింద చిక్కుకున్న వారిని ర‌క్షించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు చెప్పారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

2 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon