• Neti Charithra

బీజేపీ సీనియర్ నేత మురళి మనోహర్ జ్యోషి కి అస్వస్థత..

#బీజేపీ సీనియర్ నేత మురళి మనోహర్ జ్యోషి కి అస్వస్థత..

ఢిల్లీ: నేటి చరిత్ర (ఆగస్టు25) బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి అస్వస్థతకు గురయ్యారు. కాన్పూర్ లోని తన నివాసంలో ఉండగా ఈ మధ్యాహ్నం ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు కాన్పూర్ లోని రీజెన్సీ ఆసుపత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు. వయో నిబంధన కారణంగా ఇటీవలి ఎన్నికలకు దూరంగా ఉన్న మురళీ మనోహర్ జోషి బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు. గతంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. కొన్నిరోజుల వ్యవధిలోనే సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో జోషి ఆరోగ్య స్థితి పట్ల బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon