• Neti Charithra

బెజవాడ గ్యాంగ్ పై.. నగర బహిష్కరణ.. వేటు.. పండు.. తల్లి పైన రౌడీ షీట్ ఓపెన్ చేసిన పోలీసులు !


బెజవాడ గ్యాంగ్ పై.. నగర బహిష్కరణ.. వేటు.. పండు.. తల్లి పైన రౌడీ షీట్ ఓపెన్ చేసిన పోలీసులు !



విజ‌య‌వాడ – నేటి చరిత్ర


ఏపీలో సంచలనం రేపిన బెజవాడ గ్యాంగ్‌వార్ ‌లో పాల్గొన్న యువకులపై నగర

పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వారిపై బహిష్కరణ వేటు వేయాలని నిర్ణయించారు. అలాగే నిందితులందరిపైనా పీడీ యాక్ట్‌ను ఉపయోగించబోతున్నారు.

గ్యాంగ్‌వార్‌కు కారకులైన మాజీ రౌడీషీటర్‌ సందీప్, మణికంఠ అలియాస్‌ కేటీఎం పండు గ్రూపులకు చెందిన సభ్యులందరిపైనా పీడీ యాక్ట్‌ పెట్టనున్నారు. ఈ గ్యాంగ్ వార్ లో సందీప్ మృతి చెందాడు…ఆ రోజు నుంచి రెండు గ్రూప్ ల‌కు చెందిన అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన 10 మంది నిందితుల కోసం

పోలీసుల వేట కొనసాగిస్తున్నారు. ఇలా ఉంటే కన్నబిడ్డను నేరాలవైపు ప్రోత్సహించిన కారణంగా పండు తల్లి కోడూరి పద్మావతిపై పటమట పోలీసులు కేసు నమోదు చేసి రౌడీషీట్ ఓపెన్‌ చేశారు.

140 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon