• Neti Charithra

బి కొత్తకోట లో "150" సంఖ్యను దాటేసిన కరోనా ..రెండు బ్యాంక్ లు మూసి వేత..పది రోజులు మళ్లీ లాక్ డౌన్!


బి కొత్తకోట లో "150" సంఖ్యను దాటేసిన కరోనా ..రెండు బ్యాంక్ లు మూసి వేత..పది రోజులు మళ్లీ లాక్ డౌన్!



బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో కరోనా పాజిటివ్ కేసులు మళ్ళీ పెరిగాయి. ఇప్పటి వరకు 115 పాజిటివ్ కేసులు నమోదు కాగ గడిచిన 24 గంటల్లో ఏకంగా మరో 37 పాజిటివ్ కేసులు నమోదు కావడం తో స్థానికుల్లో కల కలం నెలకొంది.తాజా

అధికారిక లెక్కలు ప్రకారం బి కొత్తకోట సచివాలయం -1 పరిధిలో ముగ్గురు, సచివాలయం-2 పరిధిలో-ఎనిమిది, సచివాలయం-3 పరిదిలో-పదమూడు, సచివాలయం- 4 పరిధిలో ఏడుగురు, సచివాలయం-5 పరిధిలో ఒకరు, రూరల్ పరిధిలోమరో ఇద్దరు కు పాజిటివ్ గా వైద్య పరీక్షల్లో గుర్తించారు. కాగ శుక్రవారం సాయంత్రం వరకు వచ్చిన రిపోర్టుల లో బయ్యప్పగారి పల్లె లో ఇద్దరు, బడికాయలపల్లె లో ఒకరు, గట్టులో మరొకరికి పాజిటివ్ వచ్జింది.

బి కొత్తకోట లో మరో పది రోజులు సంపూర్ణ బంద్..!


బి కొత్త కోట లో భారీగా పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరగడం తో పాటు కరోనా మృతుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యం లో

ఇప్పటి కే పలువురు బ్యాంక్ సిబ్బంది కి పాజిటివ్ రావడం తో రెండు కీలక బ్యాంకులు శుక్రవారం మూతపడ్డాయి. కరోనా తీవ్రత దృష్ట్యాఆగస్టు31 వరకు బి కొత్తకోట లో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్లు తహసిల్దార్ హరికుమార్, ఎస్ ఐ సునీల్ కుమార్, ఎంపీడీఓ సుధాకర్ లు ప్రకటించారు.


1,697 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon