• Neti Charithra

బి కొత్తకోట లో సైబర్ నేరగాళ్ల..కల కలం.. జ్యులర్ షాపు యజమానులకు బెదిరింపులు..!


బి కొత్తకోట లో సైబర్ నేరగాళ్ల..కల కలం.. జ్యులర్ షాపు యజమానులకు బెదిరింపులు..!



బి కొత్తకోట: నేటి చరిత్ర


+917569200343

(ఐటి అధికారులం అంటూ బెదిరింపులు

చేస్తున్న ఫోన్ నెంబర్)


చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో పలువురు జ్యులర్స్ వ్యాపారులకు గుర్తు తెలియని వ్యక్తులు తాము ఇంకమ్ టాక్స్ అధికారులం అంటూ ఫోన్లు చేసి బ్లాక్ మెయిల్ చేయటం పట్టణం లో కల కలం రేపింది. ఇందుకు సంబంధించిన వివరాలు

ఇలా ఉన్నాయి. శనివారం ఉదయం నుంచి కొందరు వ్యక్తులు స్థానిక జ్యులర్స్ షాపుల యజమానులకు ఫోన్ చేసి మీ..షాపులపై ఐటి అధికారులు దాడులు చేసేందుకు సన్నద్ధం అవుతున్నారని మీరు సిద్ధంగా ఉండాలంటూ.. లేదంటే పది వేలు రూపాయలు మా అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయాలని బెదిరింపులకు దిగటం

సంచలనంగా మారింది. ఇలా సుమారు ఓకే రోజు..ఓకే సారి నాలుగు దుకాణాల యజమానులకు ఫోన్ చేయడం తో దుకాణ యజమానులు హదలెత్తి పోతున్నారు. ఇటీవల కొంత కాలం క్రితం కూడా గుర్తు తెలియని సైబర్ నేరగాళ్లు పలువురు స్థానిక దుకాణ యజమానులకు బెదిరించి డబ్బు తీసుకెళ్లి నట్లు సమాచారం. తాజా గా కరోనా కాలం.. ఐదు నెలలుగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో

మరో మారు ఐటి అధికారులం అంటూ పలువురిని వేధిస్తుండటం పై పోలీసులు నిఘా పెట్టి ఇలాంటి మోసగాళ్లకు తగిన బుద్ధి చెప్పాల్సి ఉంది. ఈ సైబర్ నేరాలకు పాల్పడుతున్న తీరు ను చూస్తుంటే స్థానికంగా ఉన్న కొందరి సహకారం తో దుండగులు బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.



1,347 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon