• Neti Charithra

బి కొత్తకోట లో రూ.36.72 లక్షలు నిధుల స్వాహా ... 27 మంది వెలుగు సిబ్బందిని సస్పెండ్ చేసిన అధికారులు

#బి కొత్తకోట లో రూ.36.72 లక్షలు నిధుల స్వాహా ... 27 మంది వెలుగు సిబ్బందిని సస్పెండ్ చేసిన అధికారులు

బి కొత్తకోట: నేటి చరిత్ర (ఆగష్టు30) చిత్తూరు జిల్లా బి కొత్తకోట ఉపాధి హామీ పనుల్లో రూ.36.72 లక్షలు అవినీతి.. -సామాజిక తనిఖీల్లో వెలుగు చూసిన అక్రమాలు.. - మండల వెలుగు ఏపీఎం తో పాటు 21 మంది వెలుగు సిబ్బంది.. మరో ఆరు మంది ఉపాధి హామీ ని సస్పెండ్ చేసిన అధికారులు బి కొత్తకోట మండలం లో 2018 ఏప్రిల్ నుంచి 2019 మార్చి మాసం వరకు 2753 ఉపాధి హామీ పనులకు గాను రూ.6,54,61,750 కోట్ల విలువైన వివిధ రకాల పనులు జరిగాయి. వీటి పనులకు సంబందించి తాజాగా క్షేత్ర స్థాయి సామాజిక తనిఖీలు నిర్వహించగా వీటికి సంబంధించి శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద సామాజిక తనిఖిల బహిరంగ సభ జిల్లా డ్వామా అదనపు పీడీ శ్రీనివాస ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సభలో జాతీయ ఉపాధి హామీ పనులలో రూ.60,249 లు నిధులు దుర్వినియోగం జరిగినట్లు అధికారులు తేల్చారు. కాగ వెలుగు సిబ్బంది పర్యవేక్షణలో పండ్లతోటల పెంపకానికి సంబంధించి రూ.1,46,21,849 పనులు జరుగగా వాటిలో రూ.33,32,820 లక్షల నిధులు స్వాహా అయినట్లు అధికారులు తేల్చారు. అలాగే సిరికల్చర్ రైతులకు భూమి అభివృద్ధి కింద రూ.2,18,806 లక్షలు, పాడి రైతుల గోకులాలు, దాణా కు సంబంధించి రూ.32 వేలు, పక్కా గృహాల లబ్ధిదారులకు సంబంధించి హౌసింగ్ సిబ్బంది రూ.27,072 లు , అటవీ శాఖ కు సంబంధించి రూ.1000 లు నిధులు దుర్వినియోగం అయినట్లు అధికారులు తేల్చారు. ఈసందర్భంగా వెలుగు ఏపీఎం హరినాథ్, సీసీ లు అరుణమ్మ, చంద్ర శేఖర్, హనుమంతు, రామానుజులు, హంశిర్ బేగం లతో పాటు సంఘ మిత్రాలు కవిత, శంకరమ్మ, సుజాత, అంబిక, రావనమ్మ, దిల్షాద్, శ్రీనివాసులు, నరసింహులు, శివమ్మ, భారతి, శంకర, నరసమ్మ, లీలావతి, పద్మజ, సంకరమ్మ లతో పాటు 5 మంది మేట్లు , 1 ఫీల్డ్ అసిస్టెంట్ లను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా అధికారులు ప్రకటించారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon