• Neti Charithra

బి కొత్తకోట లో మద్యం షాపులు ఎదుట ధర్నా చేసిన సీపీఐ


బి కొత్తకోట లో మద్యం షాపులు ఎదుట ధర్నా చేసిన సీపీఐ






బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరుజిల్లా బి కొత్తకోట మద్యం షాపులు ఎదుట సీపీఐ నేతలు సోమవారం ధర్నా చేశారు.కరోనా వ్యాధి వ్యాప్తి కిదోహదపడుతున్న మద్యం షాపులను మూసివేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని,CPI నియోజకవర్గపు కార్యదర్శి S.మనోహర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులను మూసివేసి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలనే డిమాండ్ మీద, భారత కమ్యూనిస్టు పార్టీ CPI రాష్ట్ర సమితి పిలుపు మేరకు, రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపుల ముందర నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ మద్యం దుకాణం ముందర నిరసన ప్రదర్శన నిర్వహించారు.

నల్లటి దుస్తులు ధరించి, ప్లే కార్డులు చేత పట్టుకున్న నిరసనకారులు నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారితో తీవ్ర భయాందోళనలో జీవించుచున్న ప్రజలు,మద్యం షాపులు తెరవడంతో మరింత భయాందోళనలు చెందుతున్నారని, కరోనా వ్యాధి త్వరగా వ్యాప్తి చెందడానికి దోహద పడుతున్న మద్యం అమ్మకాలు వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రజలకు నిత్యావసర వస్తువుల కొనుగోలుకు తక్కువ సమయం కేటాయించి, మద్యం అమ్మకాలకు ఏకంగా తొమ్మిది గంటల సమయం కేటాయించడం చూస్తుంటే ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో బయట పడిందని ఆవేదన చెందారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని ఎన్నికల్లో ఇచ్చిన "సంపూర్ణ మద్యపాన నిషేదం" హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మద్యం రేట్లు 70 శాతం పెంచి పేద ప్రజల రక్తాన్ని పీల్చుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి యస్. సలీం భాష, మండల నాయకులు బి. వేణుగోపాల్ రెడ్డి, ఎం.అష్రఫ్ అల్లి, ఎస్.తంబయ్య శెట్టి తదితరులు పాల్గొన్నారు.



358 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon