• Neti Charithra

బి కొత్తకోట లో ప్రభుత్వ జీవో పత్రాలు ను దగ్ధం చేసిన నిరసనలు చేసిన ఏఐటీయూసీ నాయకులు..!



బి కొత్తకోట లో ప్రభుత్వ జీవో పత్రాలు ను దగ్ధం చేసిన నిరసనలు చేసిన ఏఐటీయూసీ నాయకులు..!





బి కొత్తకోట: నేటి చరిత్ర


రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 17 ను తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి 450 కోట్ల రూపాయలను ఇతర పథకాలకు మళ్ళించడాన్ని అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి ఏ విధమైనటువంటి క్లయిమ్స్ మంజూరు చేయరాదని జారీచేసిన సర్కులర్ నెంబర్ 1214 లకు

వ్యతిరేకంగా,సంక్షేమబోర్డులో నమోదు చేసుకున్న ప్రతి ఒక్క కార్మికుడికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేయాలనే తదితర డిమాండ్ల తోఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘం అయిన కార్పెంటర్ యూనియన్ ఆధ్వర్యంలో, సోమవారంబీ.కొత్తకోట మండల కేంద్రంలోని జ్యోతి చౌక్ నందు "నిరసన ప్రదర్శన"


(జీవో పత్రాలను దగ్ధం చేసిన కార్మికులు)


నిర్వహించారు. జీవో నెంబర్ 17 ను రద్దు చేయాలని, సర్కులర్ నెంబర్ 12 14 ను ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లించిన బోర్డు నిధులు 450 కోట్ల ను తిరిగి జమ చేయాలని, పెండింగ్లో ఉన్నటువంటి క్లయిమ్స్ అన్నీ పరిష్కరించాలని, భవన నిర్మాణ కార్మికులకు 10 వేల రూపాయలు

చెల్లించాలని, భవన నిర్మాణ కార్మికుల పై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలనే ప్లే కార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. అనంతరం "జీవో నెంబర్ 17" సర్కులర్ నెంబర్ 12 14 ల నకలు కాపీలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ నాయకులు ఎస్.తంబయ్యశెట్టి,హెచ్.షమీవుల్లా లు మాట్లాడుతూ; రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏడాది కాలంగా ఇసుక కొరతతో పనులు లేక అర్ధాకలితో జీవించిన భవన నిర్మాణ కార్మికులు, కరోనా లాక్ డౌన్ వల్ల మరింత ఇబ్బందులు పడ్డారని ఆవేదన చెందారు. సంక్షేమ బోర్డు నుండి నమోదైన కార్మికులకు ఒక్కొక్కరికి 10 వేల రూపాయలు ఇవ్వాలని అనేకసార్లు మొరపెట్టుకున్నా కూడా ఈ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని అన్నారు. పైగా సంక్షేమ బోర్డు నిధుల నుండి అక్రమంగా జీవో నెంబర్ 17 ను తీసుకువచ్చి 450 కోట్ల రూపాయలను ప్రభుత్వం తన సొంత

పథకాలకు వాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నదని వాపోయారు. అలాగే ఏడాది కాలంగా సంక్షేమ బోర్డు నుంచి కార్మికులకు దక్కాల్సిన ఇతర పథకాలన్నీ మంజూరు చేయకుండా తాత్సారం చేస్తూ, ఇప్పుడు కార్మిక శాఖ అధికారులకు కు 12 14 సర్క్యులర్ జారీ చేసి పథకాలన్నీ ఆపివేయాలని ఆదేశించిందని విమర్శించారు. కష్టకాలంలో కార్మికులను ఆదుకోకపోగా,కార్మికవర్గం అనేక పోరాటాలు,త్యాగాలు చేసిన ఫలితంగా తన తండ్రి హయాంలో తీసుకువచ్చిన సంక్షేమ బోర్డునే లేకుండా చేసేందుకు కు జగన్ సర్కార్ పూనుకుందని ఆవేదన చెందారు. ఎన్నికల ముందు రాష్ట్రవ్యాప్త పాదయాత్రలో భాగంగా భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి సంక్షేమ బోర్డును మరింత పటిష్టంగా తయారు చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ఏఐటియుసి మండల నాయకులు ఎమ్.అష్రఫ్అలీ, ఎస్.జవహర్బాబు,యస్.గంగులప్ప, పాపన్న,షఫీ లు మరియు కార్పెంటర్ యూనియన్ నాయకులు కే. బాలాజీ,ఏ. వెంకటస్వామి,పి. షబ్బీర్,యస్. సయ్యద్,కె. బాలకృష్ణ,కె.వరదరాజులు,సి.కుమార్,ప్రసాద్,షఫీ,శ్రీనివాసులు,అమీర్ తదితరులు పాల్గొన్నారు.


180 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon