• Neti Charithra

బి కొత్తకోట లో దేవాలయాల వద్ద నిరసనలు చేపట్టిన టీడీపీ శ్రేణులు..!



బి కొత్తకోట లో దేవాలయాల వద్ద నిరసనలు చేపట్టిన టీడీపీ శ్రేణులు..!


బి కొత్తకోట: నేటి చరిత్ర


ధర్మో రక్షతి రక్షిత: హిందూ ధార్మిక క్షేత్రాల పై దాడులకు నిరసనగా తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట లో

రాష్ట్ర తెదేపా కార్య నిర్వాహక కార్యదర్శి ఎస్ ఎం పర్వీన్ తాజ్ ఆధ్వర్యంలో స్థానిక సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రభుత్వం హిందూ

దేవాలయాల పట్ల అనుసరిస్తున్న వైఖరి చూస్తే కులాలు మత విద్వేషాన్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చూస్తోందని దుయ్య బడుతూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

ఇన్ని నిరసనలు చేపట్టిన ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు రోజు రోజుకి దేవాలయాలపై దాడులు, దేవతా విగ్రహాల విధ్వంసం హుండీల అపహరణ కొనసాగుతోందని వారు విమర్శించారు.

దేవాలయ భూములపై హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగ గావ్యతిరేకం పని చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం హిందూ సంప్రదాయాన్ని దేవాలయాల లో దోపిడీ లు, విధ్వంసాలు అరికట్టడంలో పూర్తిస్థాయిలో విఫలమైందని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో రవి కుమార్, కుమార్, ప్రభాకర, నాగరాజు, ప్రసాద్ ,దుర్గా రెడ్డి , మనోహర, అంజి, రామకృష్ణ, సంతోష్, నాగరాజు, పద్మనాభ, చంద్ర, అని పి రెడ్డి ,అంత రప్ప, గోవిందు, తదితరులు పాల్గొన్నారు


592 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon