• Neti Charithra

బి కొత్తకోట లో ఇద్దరు అధికారులతో పాటు..16 మందికి కరోనా పాజిటివ్..!


బి కొత్తకోట లో ఇద్దరు అధికారులతో పాటు..16 మందికి కరోనా పాజిటివ్..!



బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో శనివారం ఒక్క రోజే కరోనా కేసులు 16 నమోదు కావడం తో స్థానికులు ఆందోళన పడుతున్నారు.తాజా గా నమోదు అయిన పాజిటివ్ కేసుల్లో మరో పోలీస్ అధికారి తో పాటు హార్సిలీహిల్స్ సమీపంలో విధి

నిర్వహనలు చూసే ఓ అధికారికి పాజిటివ్ రాగ జనుపవరిపల్లె లో ఏకంగా మరో పది మందికి పాజిటివ్ రావడం స్థానికంగా గ్రామం లో కల కలం నెలకొంది.అలాగే కాళికంబ వీధి లో ఇద్దరు , బీసీ కాలని లో ఒకరు, పిటిఎం రోడ్డు లో మరొకరికి కరోనా పాజిటివ్ సోకింది. రోజు

రోజు కు పెరుగుతున్న కరోనా కేసులతో పట్టణం లో మరో సారి లాక్ డౌన్ విధించే అవకాశాలు అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రజలు స్వీయ రక్షణ జాగ్రత్తలు తీసుకోక పోతే కరోనా మరింతగా విజృభించే అవకాశాలు అధికంగా ఉన్నాయని అధికారులు వాపోతున్నారు.


మాస్కులు.. వాడకపోతే ప్రమాదమే- ఎస్ ఐ సునీల్ కుమార్ !

మండలంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న కారణంగా ప్రజలు కోవిద్ ఆంక్షలను తప్పని సరిగా పాటించాలని ఎస్ ఐ సునీల్ కుమార్ హెచ్చరించారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోక పోవడం తోనే పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయన్నారు. అత్యవసరం పనులు కోసం మాత్రమే ప్రజలు బయటకు రావాలని సూచించారు.

ప్రతివ్యక్తి మాస్కులు తప్పని సరిగా వినియోగించాలని , ద్విచక్ర వాహనాల్లో ఇద్దరికి మించి ప్రయాణం చేయరాదని, ఆటో లలోను నలుగురికి మించి ప్రయాణం చేయరాదని అన్నారు. కోవిద్ ఆంక్షలు అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.



1,642 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon