• Neti Charithra

బి కొత్తకోట ను అష్టదిగ్బంధనం చేసిన పోలీసులు.. బయట అడుగు పెట్టాలంటే.. కష్టమే !


బి కొత్తకోట ను అష్టదిగ్బంధనం చేసిన పోలీసులు.. బయట అడుగు పెట్టాలంటే.. కష్టమే !









(నిర్మానుష్యంగా మారిన ప్రధాన మార్గాలు)


(ప్రతి వార్డు లోను స్ప్రెయింగ్ చేయిస్తున్న పంచాయతీ సిబ్బంది)


బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా బి కొత్తకోట ల్ కరోనా కట్టడికి ఆధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో సుమారు మూడు మాసాలు పాటు పోలీసులు, గ్రామ పంచాయతీ, వైద్య సిబ్బంది తీసుకున్న ముందస్తూ చర్యలు పట్టణ ప్రజలకు అండగా నిలిచాయి. అయితే కారణం ఏదైనా.. మరో రూపం లో స్థానికుల లో నలుగురికి కరోనా పాజిటివ్ నమోదు

కావటం కల కలం రేపుతోంది. దింతో ప్రమత్తం

ఈ కేసుల సంఖ్య పెరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా బి కొత్తకోట ను రెడ్ జోన్, బఫర్ జోన్ లుగా విభజించిపట్టణాన్ని అష్ట దిగ్బంధనం చేసి

అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా జన సంచారం లేకుండా పోలీసులు 24 గంటలు కర్ఫ్యూ అమలు చేస్తుండగా

జనసంచారం లేకుండా ఉండేందుకు దిగువ బస్టాండ్, రంగసముద్రం రోడ్, పిటిఎం రోడ్, బెంగుళూరు రోడ్ , బైపాస్ రోడ్లు ను

పోలీసులు అష్ట దిగ్బంధనం చేశారు.

అన్ని రకాల దుకాణాలు మూత వేయించారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో ప్రజలు బయటికి రాకుండా పాలు, కూరగాయలు, నిత్యవసర వస్తువులు ను గ్రామ వలంటీర్లు సాయం తో పంపిణీ కి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామపంచాయతీ అధికారులు ప్రతి వార్డు లోను పారిశుధ్య పనులు, స్ప్రెయింగ్ చేయిస్తున్నారు.

బి కొత్తకోట పట్టణ ప్రజలు అసౌకర్యానికి గురికాకుండా పాలు, కూరగాయలు, నిత్యవసర వస్తువులు ను అందుబాటులో కి తెచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం ఎస్ ఐ సునీల్ కుమార్, తహసిల్దార్ హరికుమార్, ఎంపీడీఓ సుధాకర్, ఈఓ ఆర్డీ అశ్విని, ఈఓ పవన్ కుమార్ లతో పాటు పలు శాఖల అధికారులు సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

1,653 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon