• Neti Charithra

బి కొత్తకోట కరోనా మృతురాలి కి మదనపల్లె లో అంత్యక్రియలు చేసిన దాతలు..!


బి కొత్తకోట కరోనా మృతురాలి కి మదనపల్లె లో అంత్యక్రియలు చేసిన దాతలు..!



మదనపల్లె: నేటి చరిత్ర



మానవత్వం పరిమళించిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.

చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో కరోనా

బారినపడి మదనపల్లె లో మృతి చెందిన మహిళ మృతదేహానికి స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో ఉచిత అంత్యక్రియలు నిర్వహించిన కార్యక్రమానికి

మదనపల్లి డివిజన్ డిప్యూటీ. డి.ఎమ్.హెచ్.ఓ.డాక్టర్ లోకవర్ధన్

హాజరు అయి బాధిత కుటుంబానికి భరోసా

కల్పించిన మానవీయ ఘటన మదనపల్లె లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. బి కొత్తకోట కు చెందిన ఓ ఓ మహిళ మదనపల్లి లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో 72 సం మహిళ కోవిడ్ తో మృతి చెందగా ఆమె తరపున బంధువులు హాజరు కాకపోవడంతో మదనపల్లి లోని మేము సైతం మరియు హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ల ఆధ్వర్యంలో డిప్యూటీ డి.ఎమ్.హెచ్.ఓ.డాక్టర్ లోకవర్ధన్. ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా డిప్యూటీ

డి.ఎమ్.హెచ్.ఓ.డాక్టర్ లోకవర్ధన్ మాట్లాడుతూ కోవిడ్ తో చనిపోయిన వారి నుండి వైరస్ 6 గం తర్వాత వ్యాప్తి ఉండదని తెలిపారు. ప్రజలు వారి బంధువులు కోవిడ్ తో చనిపోతే వారి కడసారి అంతిమ యాత్రకు కూడా హాజరు కాకుండా భయాలకు భయపడి బంధాలను వదులు కోవడం బాధగా వుందని, ఇటువంటి తరుణంలో స్వచ్ఛంద సేవా సంస్థ లు ముందుకు రావడం హర్షణీయం అని కొనియాడారు. ఈకార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.


1,344 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon