• Neti Charithra

బి కొత్తకోట ఆదర్శ పాఠశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ రెడ్డెప్ప పై వేటు వేయండి - జిల్లా అధికారులకు ఫిర్యాదు

బి కొత్తకోట: నేటి చరిత్ర (ఫిబ్రవరి5)

చిత్తూరు జిల్లా బి కొత్తకోట ఆదర్శ పాఠశాల ఇంచార్జ్ ప్రిన్స్ పాల్ రెడ్డెప్పపై వచ్చిన తీవ్ర ఆరోపణలు పై జిల్లా అధికారులు విచారణకు ఆదేశించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బి కొత్తకోట ఆదర్శ పాఠశాల కు రెగ్యులర్ ప్రిన్సిపాల్ లేకపోవటం తో గత 10 మాసాలుగా ఇంచార్జ్ ప్రిన్సిపాల్ గా రెడ్డెప్ప కొనసాగుతున్నారు. ఆయన ఇక్కడ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టీచింగ్ సిబ్బంది తోను నాన్ టీచింగ్ సిబ్బందితోను సమన్వయం చేసుకోలేక పోతున్నట్లు సమాచారం. ఇటీవల ఇదే పాఠశాల కు చెందిన 9 వ తరగతి విద్యార్థిని ని ఇంచార్జ్ ప్రిన్సిపాల్ రెడ్డెప్ప కు అత్యంత సన్నిహితుడైన కాంట్రాక్ట్ టీచర్ ( ఇతని పోస్టింగ్ విషయం లోను నిబంధనలకు వ్యక్తి రేకంగా ఇంచార్జ్ ప్రిన్సిపాల్ రెడ్డెప్ప పాఠశాల లో నియమించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి ) నవీన్ లైంగిక వేధింపులు కు పాల్పడటం తో బాధితురాలి ఫిర్యాదు మేరకు .. గత నెల లో నవీన్ కటకటాల పాలయ్యాడు. ఈనేపత్యం లో గత నెల 30 న ఇక్కడి పాఠశాల కు తనిఖీ కి వచ్చిన రాష్ట్ర ఆదర్శ పాఠశాలల మానిటరింగ్ అధికారి వెంకయ్య కు సైతం ఇదే పాఠశాల కు చెందిన విద్యార్థుల తల్లి తండ్రులు ల కమిటీ సభ్యులు ఇంచార్జ్ ప్రిన్సిపాల్ రెడ్డెప్ప అక్రమాలు.. నిర్లక్ష్యం పై వ్రాతములకంగా ఫిర్యాదు చేశారు.

ఇక్కడ ఇంటర్ విద్యార్థినుల హాస్టల్ ఉన్న కారణం గా వారి రక్షణ దృష్ట్యా రెడ్డెప్ప పై వేటు వేసి కొత్త ప్రిన్సిపాల్ ను నియమించాలని ఫిర్యాదు లో పేర్కొన్నారు. కాగ ఈపాఠశాల లో మానిటరింగ్ అధికారి వెంకయ్య తనిఖీల లోను నిల్వ ఉండాల్సిన బియ్యం కంటే అధిక నిల్వలు ఉన్నట్లు వెలుగు చూసింది. మరో వైపు గతం లోను ఈ పాఠశాలకు చెందిన ప్రభుత్వ హాస్టల్ బియ్యం ఆటోల లో తరలించినట్లు ఆరోపణ లు అధికారి దృష్టికి వెళ్లాయి. తాజా గా ఇంచార్జ్ ప్రిన్సిపాల్ రెడ్డెప్ప పై వెంటనే శాఖపర చర్యలు తీసుకొని సస్పెండ్ చేసి విద్యార్థుల కు జరుగుతున్న అన్యాయాల కు అడ్డుకట్టవేయాల ని పలు వురు దళిత సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్ భరత్ గుప్త , జిల్లా విద్యాశాఖాధికారి తో పాటు మండల విద్యాశాఖాధికారి రెడ్డి శేఖర్ ల కు వినతి పత్రాలు పంపినట్లు మీడియాకు వివరించారు.

ఈ నేపథ్యం లో ఆదర్శ పాఠశాల వివాదాల పై ప్రభుత్వం విచారన కు ఆదేశించింది.

185 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon