• Neti Charithra

బస్సు బోల్తా..ఐదుగురు మృతి!

#బస్సు బోల్తా..ఐదుగురు మృతి!

గుజరాత్: నేటి చరిత్ర (సెప్టెంబర్30) గుజరాత్‌లో 50 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్‌ బనస్కాంత జిల్లా అంబాజీ పట్టణం వద్ద సోమవారం బోల్తా పడింది. త్రిశూలియా ఘాట్‌ వద్ద వేగంగా దూసుకుచ్చిన లగ్జరీ బస్సు బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణీకులున్నారు. ఘటనపై సమాచారం అందగానే 108 బృందంతో పాటు పోలీసులు ఘటనాస్ధలానికి చేరుకున్నారు. బస్సులో చిక్కుకున్న వారిని స్ధానికుల సహకారంతో పోలీసులు వెలుపలికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో 5 గురు వ్యక్తులు మరణించారని అధికారులు వెల్లడించారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon