• Neti Charithra

ఫ్లాష్..ఫ్లాష్..ఏపీలో 13 జిల్లా లో పెరిగిన పాజిటివ్ కేసులు..మరో82 మంది మృతి..!


ఫ్లాష్..ఫ్లాష్..ఏపీలో 13 జిల్లా లో పెరిగిన పాజిటివ్ కేసులు..మరో82 మంది మృతి..!



అమరావతి: నేటి చరిత్ర

(13 జిల్లాల్లో కరోనా వివరాలు)



ఆంధ్రప్రదేశ్ లోకొత్తగా 9,996 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కేవలం 24 గంటల్లో 55,692 నమూనాలు పరీక్షించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ

బులిటెన్‌లో వెల్లడించింది. ప్రస్తుతం

రాష్ట్రవ్యాప్తంగా 90,840 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 1,70,924 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఒక్క రోజులోనే 9,499 మంది కోలుకున్నట్లు  ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 27,05,459 నమూనాలను పరీక్షించినట్లు తెలిపింది. తాజా కేసుల్లో

అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి 1,504 పాజిటివ్‌ కేసులు వచ్చాయి.

రాష్ట్రంలో తాజాగా కరోనా బారిన పడి మరో 82 మంది మృతి చెందారు. తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో పది మంది; అనంతపురం జిల్లాలో ఎనిమిది మంది; కడప జిల్లాలో ఏడుగురు; చిత్తూరు,

కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఆరుగురు; విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఐదుగురు; కృష్ణా జిల్లాలో  ఒకరు చొప్పున మృత్యువాతపడ్డారు.


291 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon