• Neti Charithra

ఫించన్ ల పంపిణి లో .. చేతి వాటం.. నలుగురు ఉద్యోగుల పై వేటు!

#ఫించన్ ల పంపిణి లో .. చేతి వాటం.. నలుగురు ఉద్యోగుల పై వేటు!

అనంతపురం: నేటి చరిత్ర (అక్టోబర్12) అనంతపురం లో పింఛన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడిన నలుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ కమిషనర్‌ ప్రశాంతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జూనియర్‌ అసిస్టెంట్‌ మధుబాబు రూ.3 వేలు, చైన్‌మేన్‌ శివశంకర్‌ రూ.2250, బిల్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు రూ.11 వేలు, జూనియర్‌ అసిస్టెంట్‌ సంజమ్మ రూ.6500 స్వాహా చేసినట్లు వెల్లడైంది. మరణించిన వారి పేరుతో వీరు పింఛన్లు డ్రా చేశారు. దీంతో వీరిపై చర్యలు తీసుకొన్నారు. గత నెలలో సస్పెండైన నర్మద, శ్రీనివాసులు, సావిత్రమ్మ అక్రమంగా డ్రా చేసిన సొమ్మును వెనక్కు చెల్లించారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon