• Neti Charithra

పెళ్ళి.. వేడుకల్లో విషాదం.. నలుగురు మృతి !

#పెళ్ళి.. వేడుకల్లో విషాదం.. నలుగురు మృతి !

హైదరాబాదు: నేటి చరిత్ర (నవంబర్10) తెలంగాణా లోని గోల్నాకలో ఆదివారం ఘోర విషాదం చోటుచేసుకుంది. స్థానిక పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో గోడ కూలి నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని అస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. గొడ కూలడంతో పక్కనే ఉన్న రెండు ఆటోలు, బైక్‌లు ధ్వంసమయ్యాయి. ఇదిలా ఉంటే శిథిలావస్థకు వచ్చిన ఫంక్షన్ హాల్లో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టవద్దని ఇదివరకే యాజమాన్యానికి నోటీసులు అందినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ వారు బేఖాతరుగా వ్యవహరించారని పోలీసు వర్గాల సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon