• Neti Charithra

పెళ్లి... పందిట్లో.. అమరావతి గోల... నవ వధువులు ఏం.. చేశారంటే !

పెళ్ళి పందిట్లో.. అమరావతి గోల... నవ వధువులు ఏం.. చేశారంటే !

అమరావతి: నేటి చరిత్ర (ఫిబ్రవరి26)

పెళ్ళి.. పందిట్లో... అమరావతి గోల... పలువురు దృష్టిని ఆకర్షించింది. అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్‌తో రాజధాని ప్రజలు 71 రోజులుగా నిర్విరామంగా పోరాడుతున్నారు. పండుగలు, వేడుకల్లో సైతం రాజధాని పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో ఇవాళ జరిగిన ఓ వివాహ వేడుక అమరావతి నినాదానికి వేదికైంది. వధూవరులు, బంధుమిత్రులంతా ప్లకార్డులు చేతబట్టి తమ అభీష్టాన్ని తెలియజేశారు. కల్యాణ మండపంలో ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని వరుడు సుధీర్‌ ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.

46 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon