• Neti Charithra

పోలీస్ సిబ్బంది పై.. చిరుత పులి దాడి.. చిత్తూరు జిల్లా లో తృటి లో తప్పిన ప్రాణాపాయం..!


పోలీస్ సిబ్బంది పై.. చిరుత పులి దాడి.. చిత్తూరు జిల్లా లో తృటి లో తప్పిన ప్రాణాపాయం..!




తిరుపతి: నేటి చరిత్ర



చిత్తూరు జిల్లా లో పోలీస్ సిబ్బంది పై

చిరుతపులి దాడి చేసిన ఘటన కల కలం రేపింది. గత నాలుగు మాసాలు గా

లాక్‌డౌన్‌ ఆంక్షల నేపథ్యంలో తిరుమలలో జనసంచారం తగ్గడంతో చిరుత పులులు, ఇతర వన్య ప్రాణుల సంచారం పెరిగింది.

ఇప్పటికే అనేక సార్లు తిరుమల పరిసరాల్లో చిరుత ల సంచారం సంచలనం కలిగించగా

తాజాగా తిరుమల రెండో కనుమ దారిలో ద్విచక్ర వాహనదారులపై చిరుత దాడి చేసింది. అలిపిరి నుంచి తిరుమలకు చేరుకునే సమయంలో 4వ కిలోమీరు వద్ద ఇద్దరు ట్రాఫిక్‌ పోలీసులపై, మరో స్థానికుడిపై చిరుత దాడికి దిగింది. అప్రమత్తమైన కానిస్టేబుల్‌ దాని నుంచి తప్పించుకుని సురక్షితంగా కొండపైకి

చేరుకున్నారు. సమాచారం అందుకున్న తితిదే విజిలెన్స్‌ సిబ్బంది, అటవీ శాఖ సిబ్బంది చిరుత దాడికి దిగిన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. కనుమ దారిలో ద్విచక్ర వాహనాల అనుమతిని తాత్కాలికంగా నిలిపివేశారు. చిరుత సంచారంతో సిబ్బంది, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ ప్రారంభం లో తిరుమల కాలి నడక మార్గం లో పలు జంతువుల పై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే.


483 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon