• Neti Charithra

పోలీస్ సిబ్బంది అక్రమాలు పై.. కన్నెర్ర.. హెడ్ కానిస్టేబుల్.. కానిస్టేబుల్ తో పాటు నలుగురి పై వేటు !


పోలీస్ సిబ్బంది అక్రమాలు పై.. కన్నెర్ర.. హెడ్ కానిస్టేబుల్.. కానిస్టేబుల్ తో పాటు నలుగురి పై వేటు !
గుంటూరు : నేటి చరిత్ర


గుంటూరు రూరల్ జిల్లాలో అక్రమాలకు పాల్పడుతున్న నలుగురు పోలీసుల పై

రూరల్‌ ఎస్పీ విజయరావు వేటు వేశారు.

సిబ్బంది అక్రమ వ్యవహారాలు పై మండిపడ్డ ఆయన ఒక హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేయడంతో పాటు ఇద్దరు

హోంగార్డులను ఏకంగా ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించారు. పోలీసులపై తీసుకున్న చర్యలను రూరల్‌ ఎస్పీ విజయరావు సోమవారం తన కార్యాలయంలో విలేకర్లకు వెల్లడించారు. దుర్గి పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న హెడ్‌ కానిస్టేబులు ఆర్‌.తాలూకారావు గురజాల సబ్‌ జైలుకు గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. పోలీసు శాఖ పేరును వాడుకుని ఇసుక డంపింగ్‌ యార్డు వద్ద

ట్రాక్టర్‌ యజమానిని బెదిరించి బలవంతంగా ఒక ట్రాక్టర్‌ ఇసుకను తన సొంత అవసరాలకు అక్రమంగా సరఫరా చేసుకున్నాడు. తెనాలి రూరల్‌ పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్‌ వి.ఈశ్వరరావు బాపట్లలోని తన ఇంట్లో జూదం నిర్వహిస్తూ పోలీసుల దాడుల్లో ఏడుగురు పేకాటరాయుళ్లు, హోంగార్డు డి. రవితో పాటు దొరికిపోయాడు. చౌడాయపాలెం పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు పి.శివకుమార్‌ తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తీసుకువస్తున్న క్రమంలో పొందుగల చెక్‌పోస్టు వద్ద పోలీసు తనిఖీల్లో పట్టుబడ్డాడు. దీంతో హెడ్‌ కానిస్టేబుల్‌ ఆర్‌.తాలూకారావు, కానిస్టేబుల్‌ వి.ఈశ్వరరావులను సస్పెండ్‌ చేయడంతో పాటు హోంగార్డులు డి.రవి, పి.శివకుమార్‌లను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు రూరల్‌ ఎస్పీ విజయరావు ప్రకటించారు.

232 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon