• Neti Charithra

పోలీస్ శాఖ లో నలుగురి ని ఉద్యోగాల నుంచి తొలగించిన ప్రభుత్వం !


పోలీస్ శాఖ లో నలుగురి ని ఉద్యోగాల నుంచి తొలగించిన ప్రభుత్వం !


అమరావతి: నేటి చరిత్ర


గుంటూరు జిల్లా లో నలుగురు పోలీసులను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ రూరల్‌ ఎస్పీ సీహెచ్‌ విజయరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేయడం అ శాఖ లో కల కలం.. రేపింది.విధుల నిర్వహణ లో అలసత్వం వహించిన

ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబులు డి. రత్నకుమార్‌, కానిస్టేబుల్లు జి.అక్కిరాజు (అచ్చంపేట పీఎస్‌), ఎం. కుర్మారావు(రేపల్లె పీఎస్‌), ఎస్‌.పోతురాజు(యడ్లపాడు పీఎస్‌)లను విధుల నుంచి తొలగించినట్లు ఎస్పీ తెలిపారు. వారిలో కొంతమంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించగా, పలువురు గత కొంతకాలంగా ఉద్యోగానికి హాజరవకుండా, ఉన్నతాధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారు. పోలీసుశాఖ నిబంధనలు ఉల్లంఘించడంతో వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది క్రమశిక్షణ కలిగి ఉండాలన్నారు. విధుల్లో అలసత్వం వహించకుండా నీతి, నిజాయతీతో పని చేయాలన్నారు.



264 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon