• Neti Charithra

పోలీస్ శాఖ లో కలకలం.. రేపుతున్న సీఐ సస్పెన్షన్!

#పోలీస్ శాఖ లో కలకలం.. రేపుతున్న సీఐ సస్పెన్షన్!

కదిరి: నేటి చరిత్ర (డిసెంబర్1) అనంతపురం జిల్లా కదిరి అర్బన్ సి.ఐ మల్లికార్జున గుప్తను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇందుకు సంబంధించి అనంతపురం రేంజ్ డి.ఐ.జి క్రాంతి రాణా టాటా ఉత్తర్వులు జారీ చేశారు. కదిరి అర్బన్ సిఐ మల్లికార్జున గుప్తపై ఇటీవల పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. వీటిపై సమగ్ర విచారణ జరిపి ఆ నివేదికను జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు అనంతపురం రేంజ్ డి.ఐ.జి కు పంపారు. ఈ నివేదిక ఆధారంగా సి.ఐ ను డి.ఐ.జి సస్పెండ్ చేశారు. కాగ కదిరి సీఐ మల్లికార్జున గుప్తా పై జిల్లా లోని పలువురు అధికారపార్టీ ఎమ్మెల్యే లు ఉన్నతస్థాయి అధికారులకు ఫిర్యాదు లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయం తాజాగా తాడేపల్లిలో జరిగిన కేబినెట్ సమావేశం లోను చర్చకు వచ్చినట్లు.. సమాచారం. కదిరి సీఐ మల్లికార్జున గుప్తా సస్పెన్షన్.. పోలీస్ శాఖలో.. కలకలం.. రేపుతోంది.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon