• Neti Charithra

పోలీసుల విచారణ తో ఆ.. కుటుంబం లో ముగ్గురు ఆత్మహత్య !


పోలీసుల విచారణ తో ఆ.. కుటుంబం లో ముగ్గురు ఆత్మహత్య !



గుంటూరు: నేటి చరిత్ర


గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని మరిప్రోలువారిపాలెంలో విషాదం చోటుచేసుకుంది.. వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే వీరారెడ్డి, భార్య వెంకటరమణ, కూతురు పోలేరు విషాహారం తిని బలవన్మరణానికి పాల్పడ్డారు.

బంధువులు గమనించి స్థానికి ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే భార్య, కూతురు మరణించారు. మెరుగైన చికిత్స కోసం వీరారెడ్డిని గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచారు.

గ్రామంలో పొలం దగ్గర ఉండే నీటి మోటర్​ను దొంగలించారని వీరారెడ్డిపై ఆరోపణలు

వచ్చాయి. ఈ విషయంపై పోలీసులు ప్రతి రోజు విచారణ పేరుతో పిలుస్తున్నారని మనస్థాపానికి గురైన కుటుంబసభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారని బంధువులు ఆరోపించారు.ఈ నెల 16 వతేదీన వీరారెడ్డి పై బాపట్ల రూరల్ పోలీసుస్టేషన్​లో కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. గ్రామంలో మూడు మోటర్లు పోయిన కేసుపై విచారణ చేపట్టగా ..ఒకటి వీరారెడ్డి దగ్గర దొరికిందని వెల్లడించారు. గ్రామంలో చాలా మంది మోటర్లు పోయాయని ఫిర్యాదు ఇవ్వగా... మనస్థాపం చెందిన వీరారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు.

167 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon