• Neti Charithra

పోలీసుల దాడులు.. భారీగా పట్టు పడ్డ ఎర్ర చందనం .. 12 మంది అరెస్ట్ !


పోలీసుల దాడులు.. భారీగా పట్టు పడ్డ ఎర్ర చందనం .. 12 మంది అరెస్ట్ !


కడప: నేటి చరిత్ర


కడప జిల్లా కలసపాడుమండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో మంగళవారం

పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ సందర్భంగాభారీగా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.12.40 లక్షల విలువ చేసే 24 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని 12 మందిని అరెస్టు చేసినట్లు

స్థానిక ఎస్సై మద్దిలేటి మీడియా కు

వివరించారు.దుంగలతోపాటు నిందితులను మైదుకూరు‌ డీఎస్పీ విజయ్ కుమార్ ముందు హాజరుపర్చామని ఎస్సై పేర్కొన్నారు. అరెస్టు చేసిన నిందితుల్లో  మండలంలోని ఎగువరామాపురానికి చెందిన ముగ్గురు, కర్నూలు జిల్లా రుద్రవరం, ఆళ్లగడ్డకు చెందిన తొమ్మది మంది ఉన్నారని ఆయన తెలిపారు. గుంటూరు ప్రాంతానికి చెందిన ఇద్దరు స్మగ్లర్ల కోసం గాలింపు చేపట్టామని ఎస్సై పేర్కొన్నారు. హెడ్ కానిస్టేబుళ్లు రాజేశేఖర రెడ్డి, ఖాదరయ్య, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఉన్నారు.


156 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon