• Neti Charithra

పోలీసులకు పట్టు పడ్డ ఏనుగు దంతాల వేట గాళ్ళు... ఏనుగు దంతాలు స్వాధీనం !

#పోలీసులకు పట్టు పడ్డ ఏనుగు దంతాల వేట గాళ్ళు... ఏనుగు దంతాలు స్వాధీనం !

బెంగుళూరు: నేటి చరిత్ర (సెప్టెంబర్19) ఏనుగులను వేటాడి చంపి వాటి దంతాలను విక్రయిస్తున్న వేటగాళ్లను అరెస్టు చేసిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లా బెల్తాన్‌గడి ప్రాంతంలో వెలుగుచూసింది. కర్ణాటక అడవుల్లోని ఏనుగులను చంపి వాటి దంతాలను విక్రయిస్తున్నట్లు అటవీశాఖ అధికారులకు సమాచారం అందింది. అటవీశాఖ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు బెల్తాన్‌గడి తాలూకాలోని సూర్యారోడ్డు వద్ద తచ్చాడుతున్న వేటగాళ్లు అబ్రహాం, అన్వర్, సురేష్ లను అరెస్టు చేశారు. వారి నుంచి ఐదు జతల దంతాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పోలీసులు వన్యప్రాణి పరిరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.

10 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon