• Neti Charithra

ప్లాస్టిక్.. మహమారిని వదిలేద్దాం.. పర్యావరణాన్ని రక్షిద్దాం- చిత్తూరు ఎం ఎల్ ఏ

#ప్లాస్టిక్.. మహమారిని వదిలేద్దాం.. పర్యావరణాన్ని రక్షిద్దాం- చిత్తూరు ఎమ్మెల్లే శ్రీనివాసులు

చిత్తూరు : నేటి చరిత్ర (అక్టోబర్2) పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేదిద్దామని చిత్తూరు శాసన సభ్యులు ఏ.శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం చిత్తూరు మునిసిపాలిటి పరిధిలో ఫిట్ ఇండియ మూమెంట్ లో భాగంగా 2కె రన్ కార్యక్రమం స్థానిక గాంధీ విగ్రహం నుండి ప్రారంభమై హై-రోడ్డు, చర్చి వీధి,పొన్నమ్మ గుడి వీధి ,ఎం.ఎస్.ఆర్.సర్కిల్ మీదుగా తిరిగి గాంధీ విగ్రహం కు చేరుకున్నారు.ఈ సందర్భంగా చిత్తూరు శాసన సభ్యులు ఏ.శ్రీనివాసులు మాట్లాడుతూ పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేదిద్దామని, పచ్చ దనాన్ని పెంచేందుకు ప్రతి ఇంటి ముందు చెట్లను నాటాలని తెలిపారు. ప్రతి వార్డు,ప్రతి ఊరు లో పచ్చదనం ను పెంచుటకు ప్రజా ప్రతినిదులు,యువత,విద్యార్థులు, ప్రజలందరూ భాగస్వాములు కావడం ద్వారా ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆ దిశగా అందరూ కృషి చేయాలన్నారు. జె.సి.2 చంద్రమౌళి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం ద్వారా మానవాళి మనుగడ కు ఎటువంటి సమస్య ఉండదని జీవ కోటి ని ప్లాస్టిక్ బారి నుండి కాపాడేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలన్నారు. చిత్తూరు మునిసిపల్ కమిషనర్ ఓబులేషు మాట్లాడుతూ చిత్తూరు మునిసిపాలిటీని ప్లాస్టిక్ రహితంగా చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టడం జరిగిందని ,ప్రజలందరూ స్వచ్చందంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పూర్తిగా మానాలని వాటి స్థానంలో పర్యావరణానికి హాని చేయని క్లాత్ బ్యాగ్స్ ని వాడాలని తెలిపారు. ఈ 2 కె రన్ కార్యక్రమాన్ని చిత్తూరు శాసన సభ్యులు గాంధీ విగ్రహం నుండి ప్రారంబించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించుటపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డి.ఈ.ఓ పాండురంగ స్వామి,ఏ.పి.ఎం.ఐ.పి.పి.డి విద్యాశంకర్,విద్యార్థులు, స్వచ్చంద సంస్థలు ,ప్రతినిధులు పాల్గొన్నారు. -

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon