• Neti Charithra

పులివెందులకు.. వరాల జల్లు కురిపించిన సీఎం జగన్!

#పులివెందులకు.. వరాల జల్లు కురిపించిన సీఎం జగన్!

పులివెందుల: నేటి చరిత్ర (అక్టోబర్30) సీఎం జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లా పులివెందుల కు వరాల జల్లు కురిపించారు. గతం లో ఎన్నడూ లేనివిధంగా నిధులు మంజూరు చేసారు. బుధవారం అమరావతి లో పులివెందుల అభివృద్ధి పై కలెక్టర్ హరి కిరణ్, కడప ఎంపీ అవినాష్ రెడ్డి లతో కలిసి అధికారుల తో ప్రత్యేకంగా సమీక్షించారు. ముఖ్యంగా పులివెందులలో ప్రభుత్వ మెడికల్‌కాలేజీ ఏర్పాటుకు సీఎం ఆదేశించారు. డిసెంబర్‌లో దీనికి శంకుస్థాపన కు చర్యలు తీసుకోవాలన్నారు. వేముల మండలం నల్లచెరువుపల్లిలో 132 కేవి సబ్‌స్టేషన్‌ నెలకొల్పనున్నారు. పులివెందుల నియోజకవర్గంలో 11 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, పులివెందుల ఏరియా ఆసుపత్రికి, వేంపల్లి సిహెచ్‌సీకి 30 కోట్లతో మౌలిక సౌకర్యాల కల్పన పులివెందుల మున్సిపాలిటీకి అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, ఎస్టీపీకి సుమారు రూ. 50 కోట్లతో డీపీఆర్‌ సిద్దం చేయాలని ఆదేశాలు పులివెందులలో కొత్త ఫైర్‌ స్టేషన్‌ బిల్డింగ్, వేంపల్లిలో కొత్త ఫైర్‌ స్టేషన్‌ మంజూరు పులివెందులలో రూ. 17.65 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం కోసం డీపీఆర్‌ సిద్దం చేయాలని ఆదేశాలు నాడు – నేడు పధకం కింద పులివెందుల నియోజకవర్గంలోని స్కూళ్ళను రూ. 30 కోట్లతో అభివృద్ది చేయాలని ఆదేశాలు వేంపల్లిలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జేఎన్‌టీయూ పులివెందులలో కొత్త లెక్చర్‌ కాంప్లెక్స్, నైపుణ్యాభివృద్ది కేంద్రానికి రూ. 10 కోట్ల నిధుల విడుదల సింహద్రిపురం, వేంపల్లి పాలిటెక్నిక్‌ కాలేజీలకు రూ. 15 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ది 2012 – 13 రబీ పంటకు సంబంధించి ఇన్సూరెన్స్‌ భీమా సొమ్ము సుమారు రూ.112 కోట్లు త్వరితగతిన రైతుల ఖాతాలోకి చేరేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశాలు, రెండు నెలల్లోగా రైతుల ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలి ఏఐసీ ఇన్సురెన్స్‌ కంపెనీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించి ఆదేశాలు ఆచరణలోకి తీసుకురావాలని ఆదేశాలు పులివెందుల మార్కెట్‌యార్డ్‌లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రూ. 5 కోట్లు మంజూరు పులివెందుల నియోజకవర్గంలో కొత్తగా 7 గోడౌన్స్, 1 కోల్డ్‌ స్టోరేజి ఏర్పాటుకు ఆదేశాలు ఏపీ కార్ల్‌ కు సీఈవో ని నియమించేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసి త్వరితగతిన నియామకానికి ఆదేశాలు పులివెందుల శిల్పారామానికి సుమారు రూ. 10 కోట్లతో అభివృద్ది ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశాలు వేంపల్లిలో మిని శిల్పారామం ఏర్పాటకు భూమి గుర్తింపు, నిర్మాణ ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశాలు ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌ ఘాట్, గండి క్షేత్రం, గండికోట, ఒంటిమిట్ట, జిల్లాలో ఇతర పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ఒక టూరిజం సర్కూట్‌ ఏర్పాటుచేయాలని ఆదేశాలు వేంపల్లిలో బిసి బాలురు, బాలికల వసతి గృహం, ఎస్సీ బాలికల వసతి గృహం ఏర్పాటుకు అనుమతి మంజూరు చేయాలని ఆదేశాలు జాతీయ స్ధాయి ప్రమాణాలతో కూడిన విద్యాసంస్ధ ఏర్పాటుచేయాలని ఆదేశం, ఇందుకు గాను పేరుగాంచిన సంస్ధలను సంప్రదించి ఏర్పాటు చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశం పట్టణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో పులివెందులలో మాల్‌ కమ్‌ మల్టిప్లెక్స్‌ ఏర్పాటుకు అవకాశాలు పరిశీలించాల్సిందిగా ఆదేశించారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon