• Neti Charithra

పొలం లో మల విసర్జన చేశాడని.. దాడి... దళిత యువకుడి మృతి !

పొలం లో మల విసర్జ న చేసాడని.. దాడి... దళిత యువకుడు మృతి !

చెన్నై: నేటి చరిత్ర (ఫిబ్రవరి17)

తమిళనాడులోని విళ్లుపురం జిల్లాలో ఓ యువకుడిపై పలువురు దాడికి పాల్పడటంతో మృతి చెందారు. విళ్లుపురం జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన దళిత యువకుడు శక్తివేల్‌ (26) పొలంలోకి మలవిసర్జనకు వెళ్లాడు. సమీపంలో పనిచేస్తున్న కొందరు మహిళలు శక్తివేల్‌ను మందలించారు. అక్కడి నుంచి వెళ్తున్న శక్తివేల్‌ను కొంత మంది గుంపుగా చేరి కాళ్ళు, చేతూలు కట్టేసి దాడి చేశారు. కుటుంబసభ్యులు శక్తివేల్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. దాడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. అగ్రవర్ణాల వారి పొలంలో మలవిసర్జనకు వెళ్లినందుకే కొట్టి చంపారంటూ మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఏడుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు.

61 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon