• Neti Charithra

పీలేరు ను జిల్లా కేంద్రం చేయాలని.. ప్రజా సంఘాల నిరసనలు..!


పీలేరు ను జిల్లా కేంద్రం చేయాలని.. ప్రజా సంఘాల నిరసనలు..!





పీలేరు: నేటి చరిత్ర



రాజంపేట నియోజకవర్గం లోని అన్ని ప్రాంతాల అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో పీలేరు ప్రాంతం ఉన్నందున పీలేరు జిల్లా ఏర్పాటు చేయాలని పీలేరు జిల్లా సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం షాది మహల్ వద్ద పోతంశెట్టి రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు ఈ మేరకు డిమాండ్

చేశారు.కొత్త జిల్లాల ఏర్పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండాలి. జిల్లాల ఏర్పాటులో శాస్త్రీయతను పాటించాలని ప్రజల అభిప్రాయాలను మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలం ఇప్పటికే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని వారు పేర్కొన్నారు. పీలేరు జిల్లా ఏర్పాటుకై అధికారులు ప్రజా ప్రతినిధులు మీద ఒత్తిడి తేవడానికి ప్రాతినిధ్యం చేయనున్నట్లు తదుపరి ప్రణాళికలతో ఉద్యమాలకు శ్రీకారం చుట్టామని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్.టీ.యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోతంశెట్టి రమేష్, యు.టీ.ఎఫ్ నాయకులు

జీ రాధాకృష్ణ, మానవతా సంస్థ అధ్యక్షులు వి.రామచంద్ర,ప్రజా సంఘాల నాయకుడు జానం గంగిరెడ్డి,ఆంధ్రప్రదేశ్ కార్పెంటర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ ఆచారి, అడ్వొకేట్ సౌకత్ అలీ,ఎన్.జీ.ఓ నాయకుడు రాంబాబు,ఆర్య వైశ్య ప్రొఫెషనల్ అండ్ అఫీషియల్ జిల్లా కార్యదర్శి రాచపల్లి శ్రీనివాసులు,

స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రహమత్ భాష,

లాయర్ రాయల సుధాకర్, ఎం.ఆర్.పీ.ఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్,ప్యారుఖాన్,గిరిజన జిల్లా కార్యదర్శి హరి నాయక్,ఆర్.టీ.సీ కార్మిక నాయకుడు బాబునాయక్,

పీలేరు జాయింట్ ఏక్షన్ కమిటీ నాయకులు అమీర్ ఖాన్, మౌలాలి,

ఎర్రం రాజు కృష్ణమూర్తి,విశ్రాంత ఉపాధ్యాయులు సీతారామయ్య శ్రీనివాసులు, శివ,ఉపాధ్యాయ నాయకులు జ్ఞాన ప్రకాష్ నాగరాజు రెడ్డి,ఆస్వా అధ్యక్షుడు నాగేంద్ర,బిస్మిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడు బోదెశ తదితరులు పాల్గొన్నారు.


124 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon