• Neti Charithra

పాల డైరీ లో గ్యాస్ లీక్ తో 20 మందికి అస్వస్థత.. చిత్తూరు లో ఉలిక్కి పడ్డ ప్రజలు..!


పాల డైరీ లో గ్యాస్ లీక్ తో 20 మందికి అస్వస్థత.. చిత్తూరు లో ఉలిక్కి పడ్డ ప్రజలు..!



చిత్తూరు: నేటి చరిత్ర






పాల డైరీ లో గ్యాస్ లీక్ కావడంతో

చిత్తూరు లోప్రమాదం చోటు చేసుకున్న ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి న వివరాలు ఇలా ఉన్నాయి...

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం ఎం.బండపల్లిలో ఉన్న హట్సన్‌ పాల డెయిరీలో అమ్మోనియా గ్యాస్‌ లీకైంది. ఈ ఘటనలో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బండపల్లి గ్యాస్‌ డెయిరీని జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా పరిశీలించారు. గ్యాస్‌ లీక్‌కు గల కారణాలను ఆయన అడిగి

తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఈ ఘటన తో చిత్తూరు నగర ప్రజలు ఉలిక్కి పడ్డారు. అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు.


261 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon