• Neti Charithra

పాలిటెక్నీక్ ప్రవేశ పరీక్షలను.. పకడ్బందీగా నిర్వహించండి- మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి..!


పాలిటెక్నీక్ ప్రవేశ పరీక్షలను.. పకడ్బందీగా నిర్వహించండి- మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి..!



మదనపల్లి: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె డివిజన్ లో

ఈనెల 27 వతేది జరిగే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష ను పకడ్బందీ గా నిర్వహించాలని సబ్ కలెక్టర్ ఎం.జాహ్నవి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం సబ్ కలెక్టర్ కార్యాలయంలో

మదనపల్లి, కలికిరి, కుప్పం, పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాల్స్, తహశీల్దార్లు,యం ఈ ఓ ల తో polycet ఎంట్రన్స్ పరీక్ష నిర్వహణపై సమీక్ష సమావేశం

నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో మదనపల్లి లో వశిష్ఠ స్కూల్, వశిష్ఠ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నిమ్మనపల్లి రోడ్డు,కేశవ రెడ్డి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నిమ్మనపల్లి రోడ్డు,శ్రీ సిద్దార్థ్ జూనియర్ కళాశాల ప్రశాంతి నగర్,శ్రీ కృష్ణ చైతన్య కళాశాల నిమ్మనపల్లి రోడ్డు, 5 కేంద్రాలు, కలిగిరి లో సికాం డిగ్రీ కళాశాల రాజువారి పల్లి,తిరుపతి రోడ్డు,JNTU ఇంజనీరింగ్ కళాశాల అకాడమిక్ బ్లాక్, JNTU ఇంజినీరింగ్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ 3 కేంద్రాలు, కుప్పం లో MPC ప్రభుత్వ జూనియర్ కళాశాల JP రోడ్డు, కొత్తపేట, MPC ప్రభుత్వ ఓకేషనల్ జూనియర్ కళాశాల 2 కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఉదయం 11 గంటల నుండి 1 గంటవరకు పరీక్ష జరుగుతుందన్నారు. మొత్తం 1756 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో ముందురోజే అన్ని రూములకు శానిటేషన్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్ష కు వచ్చే విద్యార్థులుకు సానిటీజర్ స్కానింగ్ చేసి పరీక్ష హాల్ కు పంపడం జరుగుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్కు ధరించాలని, పరీక్ష కేంద్రంలో విద్యార్థికి, విద్యార్థికి రెండు మీటర్లు దూరంలో ఉండేలా ఏర్పాటు చేయాలని సంబందితా అధికారులను ఆదేశించారు. 3 ఫ్లైయింగ్ స్వకాడు లు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎంపీడీవో, ఎంఈఓ, పోలీస్ శాఖ తరఫున అధికారులు ఉంటారని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఇద్దరిని ANM ల ను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ఉదయం 10 గంటలకు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబడదని తెలిపారు. సెంటర్ నందు కొన్ని మా స్కూల్లో

అందుబాటులో ఉంచుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.విద్యార్థులు సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించకూడదని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టరేట్ డి ఏ ఓ. షంషేర్ ఖాన్, కలికిరి, మదనపల్లి, కుప్పం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎం. ఎస్.సుమార్, ఎస్. శ్రీనివాసులు, వెంకటరమణ, ఎం ఈ ఓ లు డిప్యూటీ తాసిల్దార్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.



92 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon