• Neti Charithra

పేల్చేందుకు.. నిల్వ ఉంచిన మావోయిస్టుల డంప్ స్వాధీనం !

పేల్చేందుకు.. సిద్ధంగా ఉంచిన మావోయిస్టుల డంప్ స్వాధీనం !

విజయనగరం: నేటి చరిత్ర (ఫిబ్రవరి1)

మావోయిస్టులు భూమి లో నిల్వ ఉంచిన పేలుడు వస్తువుల డంప్ ను పోలీసులు చాక చక్యంగా స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర - ఒడిశా అటవీ ప్రాంతంలో దాచిన మావోయిస్టుల డంప్‌ ను స్వాధీనం చేసుకున్నట్లు విజయనగరం జిల్లా ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు. శనివారం ఉదయం విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో విజయనగరం జిల్లా ఎస్పీ బి. రాజకుమారి విలేక‌ర్ల స‌మావేశంలో మాట్లాడుతూ... మావోయిస్టుల కదలికల గురించి రాబడిన సమాచారం దృష్ట్యా.. (నిన్న) శుక్రవారం పాచిపెంట మండలం బంగారుగుడ్డి ఆంధ్ర - ఒడిశా సరిహద్దులోని అటవీ ప్రాంతంలో ప్రత్యేక దళాల ఆధ్వర్యంలో కూంబింగ్‌ నిర్వహించామన్నారు. ఈ కూంబింగ్‌ లో మూడు సంవత్సరాల క్రితం దాచిపెట్టిన డంప్‌ను స్వాధీనం చేసుకున్నామని అన్నారు.

ఈ డంప్‌లో (1) స్లర్రీ స్టిక్స్‌ - 52 (2) నాన్‌ ఎలక్ట్రికల్‌ డిటోనేటర్సు - 98 (3) పెద్ద గన్స్‌ - 5 (4) .303 రౌండ్సు - 20 (5) దేశవాళీ డబుల్‌ బేరల్‌ తుపాకీల్లో వినియోగించే ఖాళీ కేప్స్‌ - 6 ఉన్నట్లుగా పోలీసు బృందాలు గుర్తించాయన్నారు. జిల్లాలో 6 పోలీస్‌ స్టేషన్‌ లు మావోయిస్టు ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో మావోయిస్టుల కదలికలు లేవని స్పష్టం చేశారు. పాచిపెంట పోలీసు ప్రత్యేక దళాలు గతంలోనూ మావోయిస్టులు దాచిన ఓ డంప్‌ ను వెలికితీశాయని గుర్తు చేశారు.

పోలీసు ప్రత్యేక దళాలు స్వాధీనం చేసుకొన్న డంప్‌ ను పరిశీలించగా, గతంలో మావోయిస్టులు పోలీసు దళాలపై దాడులు నిర్వహించేందుకుగాను డంప్‌ను దాచిపెట్టి ఉండవచ్చునని అనుమానిస్తున్నట్లుగా తెలిపారు. మావోయిస్టులు భద్రపర్చిన డంప్‌ ను వెలికి తీయడంలో కీలకపాత్ర పోషించిన పోలీసు అధికారులను, సిబ్బందిని, స్పెషల్‌ టాస్క్‌ సిబ్బందిని జిల్లా ఎస్పీ బి.రాజకుమారి, ఒఎస్‌ డిజె.రామమోహనరావులు అభినందించారు.

9 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon