• Neti Charithra

ప్రేమ..విఫలమై.. ఆత్మహత్య చేసుకున్న సచివాలయ మహిళా ఉద్యోగి..చిత్తూరు జిల్లా లో విషాదం !


ప్రేమ..విఫలమై.. ఆత్మహత్య చేసుకున్న సచివాలయ మహిళా ఉద్యోగి..చిత్తూరు జిల్లా లో విషాదం !



సదుం: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా సదుం కు చెందిన మహిళా సచివాలయ ఉద్యోగి బావి లోకి దూకి ఆత్మహత్య కు పాల్పడటం సంచలనం కలిగించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

సదుం మండలం బూరగమంద సచివాలయంలో సర్వేయర్‌గా విధులు నిర్వర్తిస్తున్న లావణ్య(21) సూసైడ్ చేసుకుంది. బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఉద్యోగంలో చేరి ఏడాది కూడా గడవకుండానే ఆమె సూసైడ్ చేసుకోవడం స్థానికులను కలచివేసింది.

అయితే లావణ్య ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి.బూరగ మంద సచివాలయం లో పని చేస్తున్న సర్వేయర్ లావణ్య అదే సచివాలయం లో పనిచేస్తున్న మరో ఉద్యోగి తో ప్రేమలో పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకునేందుకు అంగీకారానికి వచ్చారు. అయితే ఏం జరిగిందో ఏమో కాని యు

వకుడు పెళ్లికి నిరకరించినట్లు తెలుస్తోంది. దింతో రెండు రోజుల క్రితం లావణ్య తనను మోసం చేసినయువకుని పై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో

పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మళ్ళీ లావణ్య పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు వెనక్కు తీసుకుంటానని పోలీసులకు కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సచివలయ ఉద్యోగి మహిళా సర్వేయర్ ఓ బావిలో శవమై తేలింది. ఈ సందర్భంగా ఆమె తన చావుకు ఎవరు కారణం కాదని సూసైడ్ నోట్ కూడా రాసి ఉంచటం పలు అనుమానాలకు తావిస్తోంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.


568 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon