• Neti Charithra

ప్రేమ పేరుతో నమ్మించాడు.. నగ్న చిత్రాలు తీసి.. ఇంటర్నెట్ లో పెట్టిన..నిందితుడు పుంగనూరు లో అరెస్ట్





పుంగనూరు: నేటి చరిత్ర (ఫిబ్రవరి27)

ఓ మైనర్ బాలికను

మాయమాటలతో ప్రేమ పేరుతో వంచించి నగ్నచిత్రాలను రహస్యంగా తీసి వాటిని ఫేస్‌బుక్కుల్లో పెట్టి బ్లాక్‌మెయిల్‌ చేసి , చివరకు నిర్భయ చట్టంతో ఓ నిందితుడు

కటకటాలపాలయ్యాడు.


చిత్తూరు జిల్లా పుంగనూరు

సీఐ గంగిరెడ్డి కథనం మేరకు..


పుంగనూరుపట్టణానికి చెందిన ఓ బాలికను రాంకుప్పం మండలం నంద్యాల గ్రామానికి చెందిన జగదీష్‌కు బాలికతో కలసి చదువుకునే సమయంలో పరిచయమైంది. ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న జగదీష్‌ ప్రేమపేరుతో బాలికను వంచించి, సన్నిహితంగా ఉంటు నగ్నచిత్రాలను చిత్రీకరించాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులకు తెలపడంతో తల్లిదండ్రుల సూచనల మేరకు ఆ బాలిక జగదీష్‌కు దూరంగా ఉండటం చేసింది. దీనిపై కక్ష పెంచుకున్న జగదీష్‌ బాలికతో తీసుకున్న నగ్నచిత్రాలను ఫేస్‌బుక్కు ద్వారా నకిలి అకౌంట్లతో వైరల్‌ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు సీఐ గంగిరెడ్డికి ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసి , దీనికి బాధ్యుడైన జగదీష్‌పై నిర్భయచట్టం, సైబర్‌ నేరాల క్రింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ముఖ్యంగా బాలికలు ఎక్కువుగా ప్రేమపేరుతో వంచనకు గురౌతున్నారని తెలిపారు. ఎవరితోకానీ, వీడియోలు, ఫోటోలు తీసుకోవడం చేయవద్దని సూచించారు. అలాగే మహిళలు ఆండ్రాయిడ్‌ సెల్‌ఫోన్లను వినియోగించవద్దని సూచించారు. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు మహిళలు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే వివరాలను రహస్యంగా ఉంచి, బాలికలను వేదించే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.




50 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon