• Neti Charithra

ప్రేమించి..పెళ్లి చేసుకున్నాడు.. నెలరోజులకే.. మరో పెళ్లి.. !కేసు నమోదు చేసిన బి కొత్తకోట పోలీసులు!


ప్రేమించి..పెళ్లి చేసుకున్నాడు.. నెలరోజులకే.. మరో పెళ్లి.. !కేసు నమోదు చేసిన బి కొత్తకోట పోలీసులు!



బి కొత్తకోట: నేటి చరిత్ర


(బి కొత్తకోట పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధిత యువతి కుటుంబ సభ్యులు)


ప్రేమించి పెళ్లి చేసుకున్న మాసానికే ఓ యువతిని వదిలి మరో పెళ్లి చేసుకున్న యువకుని పై చిత్తూరు జిల్లా బి కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన వహాటు చేసుకొంది. పోలీసుల కథనం

మేరకు..మండలానికి చెందిన పెద్దపల్లి గ్రామం శ్రీనివాసులు కుమారుడు మహేష్ అదే గ్రామానికి చెందిన మనీషా ను కొంతకాలం గా ప్రేమించి ఇటీవల మాసం క్రితం తంబల్లపల్లె మండలం కోసువారిపల్లె లోని శివాలయం లో వివాహం చేసుకున్నాడు. మనీషా పెళ్లి అనంతరం తనతో పాటు కట్న కానుకలు తెలేదనీ

గొడవకు దిగాడు. కొందరు పెద్దలు ఇద్దరి ని సముదాయించారు. అయితే ఇవన్నీ పక్కన బెట్టి యువకుడు మహేష్ ఇటీవల మరో యువతిని పెళ్లి చేసుకున్న సమాచారం తెలుసుకున్న బాధితురాలు బి కొత్తకోట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ ఐ సునీల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


2,117 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon