• Neti Charithra

ప్రేమకు అడ్డుచెప్పిన తల్లి నే... కిరాతంగా హత మార్చిన కుమార్తె !

#ప్రేమకు అడ్డుచెప్పిన తల్లి నే... కిరాతంగా హత మార్చిన కుమార్తె !

రంగారెడ్డి :నేటి చరిత్ర (అక్టోబర్28) కన్నతల్లిని కుమార్తె అమానుషంగా హత్య చేసిన ఘటనలో అంతు చిక్కని విషయాలు వెలుగు చూస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా లో ప్రియుడితో కలిసి తల్లిని కడతేర్చి... ఆ నేరం నుంచి తప్పించుకునేందుకు తండ్రిపైనే ఫిర్యాదు చేసిన కీర్తి తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ప్రేమ వ్యవహారంలో తనను మందలించిందనే కోపంతో పల్లెర్ల కీర్తి తన తల్లి రజితను దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్ శివార్లలోని హయత్‌నగర్‌లో చోటు చేసుకున్న ఈ అమానుష ఘటనపై నిందితురాలి తండ్రి శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ... డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి తన కూతురు, భార్య కనిపించకపోవడంతో కీర్తికి ఫోన్‌ చేసినట్లు తెలిపారు. ‘కీర్తిని ఎక్కడున్నావు అని అడిగాను. తను వైజాగ్‌ వెళ్లానని చెప్పింది. మరి అమ్మ ఎక్కడ ఉంది అని అడిగితే తనకు తెలియదంది. అయితే తను చెబుతున్న మాటల్లో పొంతన లేకపోవడంతో నాకు అనుమానం వచ్చింది. వైజాగ్‌ ఎవరితో వెళ్లావు అని నిలదీశాను. తను తడబడింది. దీంతో నాకు అనుమానం వచ్చింది. అంతేకాదు నేను తాగి వచ్చి రజితను తిట్టడంతో తను ఎక్కడికో వెళ్లిందని చెప్పింది. నాపైనే పోలీసులకు ఫిర్యాదు చేసింది’ అని శ్రీనివాసరెడ్డి వాపోయారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon