• Neti Charithra

ప్రయివేటు వైద్యుని తో పాటు ఐదుగురికి కరోనా..పాజిటివ్.. బి కొత్తకోట లో భారీగా పెరుగుతున్న కేసులు..!



ప్రయివేటు వైద్యుని తో పాటు ఐదుగురికి కరోనా..పాజిటివ్.. బి కొత్తకోట లో భారీగా పెరుగుతున్న కేసులు..!



బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో మరో ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటం స్థానికుల్లో కల కలం రేపుతోంది. ఇప్పటికే 18 కేసులు నమోదు కాగ తాజాగా బి కొత్తకోట లో ఓ ఆర్ ఎంపీ వైద్యునితో పాటు బీసీ కాలని కి చెందిన ఓ గర్భిణికి(శుక్రవారం ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది) అలాగే

ఓ మాజీ ఉపాధ్యాయు రాలు తో పాటు రంగసముద్రం రోడ్డు లోని ఇద్దరు

దంపతులు కు పాజిటివ్ తేలినట్లు సమాచారం. కాగ బి కొత్తకోట లో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు సంఖ్య ప్రజల్లో ఆందోళన పెంచుతోంది. ప్రజలు

అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. అత్యవసరం అయితేనే బయటికి రావాలని వారు కూడా సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు తప్పని సరిగా వినియోగించాలని కోరుతున్నారు.


2,143 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon