• Neti Charithra

ప్రభుత్వ స్థలాలు లోని అక్రమకట్టడాలు..కూల్చేస్తాం- మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి..!


ప్రభుత్వ స్థలాలు లోని అక్రమ కట్టడాలు..కూల్చేస్తాం- మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి..!


మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరుజిల్లా మదనపల్లి లో

సబ్ కలెక్టర్ జాహ్నవి ఆక్రమణకు గురైన

పలు ప్రభుత్వ భూములను స్వయంగా

పరిశీలించారు. ప్రభుత్వ భూములలో

అక్రమంగా నిర్మణాలు చేపట్టితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.బుధవారం తహశీల్దార్

సురేష్ బాబు తో కలసి మదనపల్లి

మండలం మరియు మున్సిపాలిటీ పరిధిలోని వెంకప్ప కోట సర్వే నెంబరు 3, చంద్రా కాలనీ 533 , అనప్పగుట్ట 534 బి.కె.పల్లి 410,, 516, 517, ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించారు.

అనంతరం మీడియా తో మాట్లాడుతూ మదనపల్లి మండలంలో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైందని కొందరు అర్జీలద్వారా ఫిర్యాదు చేశారని దింతో వాటి స్థితి గతులు పరిశీలించమన్నారు. ఆక్రమణ స్థలాల నివేదికలు పరిశీలించి ఆక్రమణ దారులు పై చట్టపర చర్యలు తీసుకుంటామన్నారు.ఎవ్వరైనా ప్రభుతం

భూములు ఆక్రమించిన అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటి కే ప్రభుత్వ భూములలో అక్రమ కట్టడాలను తొలగించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో తాసిల్దార్ సురేష్ బాబు విఆర్ఓ రెడ్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.



511 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon