• Neti Charithra

ప్రభుత్వ పాఠశాల ల సమస్యలు ప్రభుత్వం దృష్టికి- ఎమ్మెల్సీ కత్తి నరసింహ రెడ్డి

#ప్రభుత్వ పాఠశాల ల సమస్యలు ప్రభుత్వం దృష్టికి- ఎమ్మెల్సీ కత్తి నరసింహ రెడ్డి

కడప:నేటి చరిత్ర (సెప్టెంబర్18) పాఠశాలల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పేర్కొన్నారు. బుధవారం కడప జిల్లా అట్లూరు మండలంలోని పది పాఠశాలలను ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా అట్లూరు మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కస్తూర్భా పాఠశాలను సందర్శించి పాఠశాలలోని పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అట్లూరు హైస్కూల్లో తాగు నీటి సమస్య, టాయిలెట్ల సమస్య, కాంపౌండ్‌ వాల్‌ సమస్య, కస్తూరి బస్సుల్లో గ్రౌండ్‌ సమస్య, సోమేశ్వరపురంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్లో పది సంవత్సరాల నుండి ప్రధానోపాధ్యాయులు వాచ్‌మెన్లు, క్లర్క్‌ లు లేరని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎమ్మెల్సీ దృష్టికి తెచ్చారు. కమలాకూరు పాఠశాలలో పలు సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తెచ్చారు. ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ.. వెంటనే పాఠశాలల్లోని అన్ని రకాల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon