• Neti Charithra

ప్రభుత్వ నిర్ణయం తో ఆర్టీసీ కి రూ.3300 కోట్లు మిగులు- ఇన్చార్జ్ ఎండి కృష్ణ బాబు

#ప్రభుత్వ నిర్ణయం తో ఆర్టీసీ కి రూ.3300 కోట్లు మిగులు- ఇన్చార్జ్ ఎండి కృష్ణ బాబు

అమరావతి: నేటి చరిత్ర (సెప్టెంబర్26) ఏపీ లో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తే రూ.3300 కోట్లు ఆర్టీసీకి మిగులుతుందని ఆర్టీసీ ఇంఛార్జ్ ఎండీ కృష్ణబాబు తెలిపారు. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగుల విలీన ప్రక్రియ జనవరి 1కి పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీకి నెలకు 100 కోట్లు నష్టం వస్తుందన్నారు. 2015 నుండి డీజిల్, జీతభత్యాలు పెరగడం వల్ల నష్టాలు వస్తున్నాయని వివరించారు. అందుకోసమే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఉద్యోగులను విలీనం చేస్తే 3300 కోట్లు ఆర్టీసీకి మిగులుతుందన్నారు. డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. డీజిల్ బస్సులకు కి.మీకి రూ.13 ఖర్చు అవుతుందన్నారు.. అదే ఎలక్ట్రికల్ బస్సులకైతే రూ.3లు మాత్రమే ఖర్చు అవుతుందని తెలిపారు. ప్రస్తుతానికి 350 బస్సులు కేంద్రం ఏపీకి మంజూరు చేసిందన్నారు. ప్రైవేటుగా మరో 650 బస్సులు హైయర్ చేయబోతున్నామన్నారు. ఇందులో అనవసరమైన ఆరోపణలు అక్కర్లేదని సూచించారు. ఎలక్ట్రికల్ బస్సులపై ఎక్స్‌ఫర్ట్స్ కమిటీతో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మిగిలిన రాష్ట్రాల్లో రేట్స్‌ను బట్టి ఓపెన్ టెండర్స్‌కి వెళ్తామన్నారు. లీజ్ పద్ధతిలో తీసుకోవడానికి ఈ టెండర్స్ పెడుతున్నట్లు వెల్లడించారు. 12 సంవత్సరాలకు లీజుకు తీసుకుంటామన్నారు. విశాఖ, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి రూట్స్‌లో ఈ బస్సులు తిరగబోతున్నాయన్నారు. ఈ ఏడాది 1000 ఎలక్ట్రికల్ బస్సులు తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. బాగా రన్ అయితే మరిన్ని ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. దసరా సందర్భంగా 1800 స్పెషల్ సర్వీస్‌లు నడపబోతున్నట్లు ప్రకటించారు. 1300 బస్సులు హైదరబాద్ నుంచి... 300 బస్సులు బెంగళూరు నుంచి నడపబోతున్నట్లు వెల్లడించారు

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon