• Neti Charithra

ప్రధాని నరేంద్ర మోడీ కి అరుదైన పురస్కారం

#ప్రధాని నరేంద్ర మోడీ కి అరుదైన పురస్కారం

ఢిల్లీ: నేటి చరిత్ర (ఆగస్టు24) యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అరుదైన గౌరవం లభించింది. అబుదాబి యువరాజు మహ్మద్‌ బిన్‌ జాయోద్‌ అల్‌ నాహ్యన్‌ ప్రధాని మోదీని ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ జాయెద్‌’తో సత్కరించారు. ఇరు దేశాల ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసినందుకు గానూ మోదీకి ఈ అవార్డును అందించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో యూఏఈ మోదీకి అత్యున్నత పురస్కారానికి ప్రకటించిన విషయం తెలిసిందే. ‘ఎన్నడూ లేనంతగా భారత్‌తో మా బంధాలు బలపడ్డాయి. అందుకోసం నా మిత్రుడు, ప్రధాని మోదీ ఎంతగానో కృషిచేశారు. ఆయన చేసిన ఈ కృషికి గాను ఆయనకు జాయెద్‌ పురస్కారాన్ని(దేశంలో అత్యున్నతమైనది) ప్రకటిస్తున్నాను. ప్రధాని మోదీ అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త దిశానిర్దేశం చేశారు’ అని అబుదాబి యువరాజు జాయెద్‌ అల్‌ నాహ్యన్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ప్రధాని ఆ దేశంలో పర్యటిస్తున్న సందర్భంగా ఈ పురస్కారాన్ని అందజేశారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon