• Neti Charithra

ప్రతి టైలర్ కు రూ. 10 వేలు ఇవ్వాలని.. చిత్తూరు జిల్లాలో నిరసనలు !


ప్రతి టైలర్ కు రూ. 10 వేలు ఇవ్వాలని.. చిత్తూరు జిల్లాలో నిరసనలు !




బి కొత్తకోట: నేటి చరిత్ర


రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన "జగనన్న చేదోడు" పథకం నందు అర్హులైన ప్రతి దర్జీని చేర్చి, పది వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని AITUC నాయకులు

మంగళవారం చిత్తూరుజిల్లా బి కొత్తకోట లో నిరసన చేపట్టారు. ఏఐటీయూసీ జిల్లా నాయకుడు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ

సొంత షాపులు లేకుండా,ఇంటి వధ్ధనే టైలరింగ్ పని చేసుకుంటూ జీవిస్తున్న

మహిళ, పురుష దర్జీలకు జగనన్న చేదోడు పథకం నందు చోటు కల్పించకుండా, అనర్హులుగా ప్రకటించిన అధికారుల తీరుకు నిరసనగా, బి.కొత్తకోట టైలరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో, మంగళవారం ఉదయం 11 గంటలకు, స్థానిక ఎంపిడిఓ కార్యాలయం ముందర భౌతిక దూరం పాటిస్తూ బైఠాయించి నిరసన ప్రదర్శన

నిర్వహించారు. అర్హులైన ప్రతి దర్జీకి పదివేల ఆర్థిక సాయం అందించాలని, సొంత షాప్ నిబంధనను రద్దు చేయాలని, దరఖాస్తు చేసుకున్న మహిళ దర్జీలందరినీ పథకం నందు అర్హులుగా నమోదు చేయాలని, పేద దర్జీల పై అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో AITUC నాయకులు S.మనోహర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సలీమ్ బాష,యూనియన్ అధ్యక్షుడుV.లక్ష్మన్న లు ఎంపీడీవో సుధాకర్ కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి V.రాము కోశాధికారి రంగనాథ్, గౌరవాధ్యక్షులు V. ఇమాం సాబ్,మండల కార్మిక నాయకులు H.షమీ వుల్లా, M.అష్రఫ్ అల్లి,S. తంబయ్యశెట్టి,శంకర ఆనందమ్మ,లక్ష్మి, మమత,భార్గవి, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

119 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon