• Neti Charithra

ప్రతి కార్మికునికి కార్మిక సంక్షేమ పథకాలు..అందించాలి- భవన కార్మిక సంఘం డిమాండ్..!


ప్రతి కార్మికునికి కార్మిక సంక్షేమ పథకాలు..అందించాలి- భవన కార్మిక సంఘం డిమాండ్..!



పెద్దతిప్పసముద్రం : నేటి చరిత్ర



భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండీ మరిన్ని సదుపాయాలు సాధనకోసం కార్మికులందరూ ఏకం కావాలని ఏ.పి బిల్డింగ్&కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లాసమితి సహాయకార్యదర్శి

యస్.తంబయ్యశెట్టి పిలుపునిచ్చారు.

చిత్తూరు జిల్లా పిటిఎం మండలంలోని బూర్లపల్లి గ్రామపంచాయతీ లోని

సొన్నువారిపల్లిలో 70 మంది భవననిర్మాణ కార్మికులకు మదనపల్లి డివిజన్ కార్మికశాఖ అధికారులు మంజూరు చేసిన సంక్షేమబోర్డు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి హాజరైన ఎస్.తంబయ్యశెట్టి,ఏఐటియూసి జిల్లాసమితి కౌన్సిల్ సభ్యుడు ఎం.అష్రఫ్ అల్లి లు మాట్లాడుచూ;రాష్ట్ర సంక్షేమ బోర్డులో 20 లక్షలకు పైగా కార్మికులు నమోదుఅయివున్నారని,1350 కోట్లరూపాయలు బోర్డు నిధులున్నాయన్నారు.ప్రస్తుతం బోర్డునుండీ కల్పిస్తున్న సౌకర్యాలు అరాకొరగా ఉన్నాయని,పక్క రాష్ట్రాలైన కేరళ,తమిళనాడులలో అమలు జరుగుచున్న విదంగా,పనిముట్లుకొరకు వడ్డీలేని రుణాలు,55 సంవత్సరములు దాటిన కార్మికులకు నెలకు 5 వేలరూపాయల పింఛన్లు,ఆడపిల్లల వివాహాలకు లక్ష రూపాయల ఆర్థికసాయం,సహజమరణానికి 2లక్షల సాయం,ఉచితవైద్యం తదితర సదుపాయాలు కల్పించాలని,కరోనా వల్ల ఇబ్బందులు పడుచున్న కార్మికులకు

సంక్షేమ బోర్డు నిధులనుండీ ఒక్కొక్క రికి 10 వేల రూపాయలు చొప్పున ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం మండల సీనియర్ నాయకులు డి.ఓబులేసు చేతులమీదుగా కార్మికులకు గుర్తింపుకార్డులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో భవననిర్మాణ కార్మికులు అంజప్ప,పెన్నయ్య,మంజుల,శంకర తదితరులు పాల్గొన్నారు.


91 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon