• Neti Charithra

పెన్షన్ పంపిణీ చేస్తూ.. వాలంటీర్ గుండె పోటుతో మృతి.. రూ.5 లక్షలు పరిహారం ప్రకటించిన సీఎం జగన్ !


పెన్షన్ పంపిణీ చేస్తూ.. వాలంటీర్ గుండె పోటుతో మృతి.. రూ.5 లక్షలు పరిహారం ప్రకటించిన సీఎం జగన్ !




విశాఖ: నేటి చరిత్ర


లాక్ డౌన్ వేళ .. అభాగ్యులు కు సేవలు అందిస్తూ.. పెన్షన్ పంపిణీ చేస్తూ.. గుండె పోటు తో మృతి చెందిన గ్రామ వాలంటీర్ కుటుంబానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి రూ.5 లక్షలు పరిహారం ప్రకటించారు. వివరాలు ఇలా ఉన్నాయి.

విశాఖ ఏజెన్సీ పాడేరు మండలం తుంపాడ గ్రామ సచివాలయం కుజ్జెలి పంచాయతీలో పెన్షన్లు పంపిణీచేస్తూ గుండెపోటుతో మరణించిన గబ్బాడ అనూరాధ (26) కుటుంబానికి రూ. 5లక్షల పరిహారాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ ప్రకటించారు. దినపత్రికల్లో ఈ వార్తను చూసిన వెంటనే సీఎంఓ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఘటన వివరాలను అడిగితెలుసుకున్నారు. విపత్తు సమయంలో విశేషంగా పనిచేస్తున్న వాలంటీర్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆదుకోవాల్సిన అవసరం ఉందని సీఎం ఈ సందర్భంగా అన్నారు. గబ్బాడ అనూరాధ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. అనూరాధ కుటుంబానికి ఈ సహాయం వెంటనే అందేలా చూడాలని విశాఖ జిల్లాకలెక్టర్‌ను ఆదేశించారు.


207 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon