• Neti Charithra

పేదల ఇళ్లు కూల్చేశారు

#పేదల_ఇళ్లు_కూల్చేశారు

కడప : నేటి చరిత్ర (ఆగస్టు23) కాల్వ పోరంబోకు స్థలంలో పేదల ఇళ్లను బలవంతంగా కూల్చేసిన వైనం శుక్రవారం నగరంలోని ఆర్ట్స్‌ కళాశాల ఎదురుగా ఉన్న ఎన్టీఆర్‌ నగర్‌ లో చోటు చేసుకుంది. బాధితుల వివరాల మేరకు.. గత 40 ఏళ్ళుగా 6 ఇళ్ల ప్రజలు కలిసి కాల్వ పోరంబోకు స్థలంలో నివాసముంటున్నామని అన్నారు. చంద్రమోలి స్కూల్‌ కరెస్పాండెంట్‌ వెంకటేశ్వర్లు తనకు ఆ స్థలంలో 30 సెంట్లు అనుబంధం ఉందని పోలీస్‌, ఎమ్మార్వో కు ఫిర్యాదు చేశాడని తెలిపారు. తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే.. పోలీస్‌ బలగాలతో, ఎమ్మార్వో సిబ్బంది వచ్చి ఇళ్లలోని మహిళలను ఇంట్లో నుంచి బలవంతంగా లాగి కొట్టి ప్రొక్లైన్‌ తో 6 ఇళ్లను కూల్చివేశారని వాపోయారు. 40 ఏళ్ళు గా కాల్వ పోరంబోకు స్థలంలో నివాసముంటున్న తమ 6 ఇళ్లను కూల్చడం దారుణమని ఆవేదన చెందారు. కాల్వ పోరంబోకు స్థలంలో ఎవరికి కూడా మాములుగా అనుబంధ పత్రాలు ఇవ్వకూడదని అయినప్పటికీ రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌ భూ కబ్జాదారుల కు అప్పనంగా భూమిని కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందని బాధితులు ఆరోపించారు.

52 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon