• Neti Charithra

పేదలకుఇంటి పట్టాల ను పంపిణీ చేయాలని..బి కొత్తకోట తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టనుంచిన సీపీఐ..!


పేదలకుఇంటి పట్టాల ను పంపిణీ చేయాలని..బి కొత్తకోట తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టనుంచిన సీపీఐ..!



బి కొత్తకోట: నేటి చరిత్ర

చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో

పేదలకు ఇంటిపట్టాల పంపిణీలో కాలయాపన చేస్తున్న రాష్ట్రప్రభుత్వ వైఖరికి నిరసనగాసీపీఐ రాష్ట్రసమితి పిలుపు మేరకు సోమవారం తహసిల్దార్

కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్నుద్దేశించి నియోజకవర్గపు కార్యదర్శి యస్.మనోహర్ రెడ్డి మాట్లాడుచూ;రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు నవరత్నాలలో భాగంగా, రాష్ట్రంలోని 30 లక్షల కుటుంబాలకు పక్కా ఇడ్లు నిర్మించి ఇవ్వాలనే సదుద్దేశ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 62 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం సిద్ధం చేసిందని,ఇందులో ప్రభుత్వ భూమి 25 వేల ఎకరాలు, 7,500 కోట్ల రూపాయలతో ప్రైవేట్ వారి దగ్గర కొన్నది 23 వేల ఎకరాలు,విశాఖలో 4 వేల ఎకరాలు, CRDA లో 1100 ఎకరాలు,టిట్కో ద్వారా 2500 ఎకరాలు చొప్పున సమీకరణ చేయడం జరిగిందని అన్నారు.అయితే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పుచున్నట్లు కోర్టు వివాదాలలో ఉన్న భూమిపోనూ,మిగిలిన భూమిని పేదలకు పట్టాలు పంపిణీ చేయకుండా కోర్టులు సాకుగా చూపి

రాష్ట్రమంతటా పట్టాల పంపిణీ కార్యక్రమం నిలిపివేయడం ఎంతవరకూ సబబో ప్రభుత్వం ఆలోచించాలని హితవు పలికారు.అనంతరం గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలలో 85 శాతం పూర్తి చేసిన ఎనిమిది లక్షల టిట్కో ఇండ్లను వెంటనే లబ్ధిదారులకు పంచాలని,గత ప్రభుత్వాల హయాంలో అసంపూర్తిగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్లకు కూడా ప్రస్తుతం పెంచిన నిర్మాణవ్యయాన్ని వర్తింప చేయాలని,ప్రస్తుత పట్టాల పంపిణీ జాబితాలో చోటులేని పేదలకు చోటు కల్పించాలని,ఇదివరకే ప్రభుత్వ స్థలాలలో ఇండ్లు నిర్మించుకొని కాపురాలున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని,తదితర డిమాండ్స్ తో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ గారికి సమర్పించారు.ఈ కార్యక్రమలో సీపీఐ మండల నాయకులు యస్.తంబయ్య శెట్టి,ఎమ్.అష్రఫ్ అల్లీ,యస్.మహమ్మద్ ఖాసీం,జవహర్ బాబు,డి.బాబు, గంగులమ్మ,బేబీ,లక్షుమన్న,వల్లీసాబ్,మోదీన్,గంగమ్మ,లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.


201 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon