• Neti Charithra

పాడి రైతులను..చంద్రబాబు ముంచితే.. జగన్ పాడి రైతులకు చేయుత ఇస్తున్నారు-మదనపల్లె లో "మంత్రులు"..!



పాడి రైతులను..చంద్రబాబు ముంచితే.. జగన్ పాడి రైతులకు చేయుత ఇస్తున్నారు-మదనపల్లె లో "మంత్రులు"..!



మదనపల్లె: నేటి చరిత్ర


పాడి రైతుల అభివృద్ధి కి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పశు సంవర్థక శాఖ మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె లో నాడు- నేడు ముగింపు

పాదయాత్ర లో డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్థానిక ఎమ్మెల్యే నవాజ్ బాషా తో కలిసి ఆయన గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాడి రైతులతో జరిగిన ముఖాముఖి




కార్యక్రమంలో పాల్గొన్నారు. పాడి రైతుల అభివృద్దికి సీఎం జగన్ మోహన్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. పాల ధరల పెంపుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. డిప్యూటీ సీఎం

నారాయణస్వామి మాట్లాడుతూ టీడీపీ హయాం లో చంద్రబాబు పాడి రైతుల ను దగా చేస్తే.. సీఎం జగన్ మోహన్ రెడ్డి రైతుల ఆర్థికాభివృద్ధి కి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే నవాజ్ బాషా మాట్లాడుతూ పాదయాత్ర లో ఇచ్చిన హామీల కంటే అధికంగానే సీఎం జగన్ మోహన్ రెడ్డి

సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమాల్లో చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప ,పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ్ , నాయకులు జింకా చలపతి, ఉదయ్ కుమార్, శమిమ్ అస్లాం, కిరణ్, మాజీ కౌన్సిలర్ ఖాజా, జిల్లా వైసీపీ యూత్ సెక్రెటరీ ఎస్ ఏ కరిముల్లా, మైనార్టీ నాయకులు మెట్రో బాబ్ జాన్, మోదిలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ బీఆర్ సెల్వి, మెదర కార్పొరేషన్ డైరెక్టర్ సుజాత సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు


179 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon