• Neti Charithra

పెట్రోల్..బంక్ లో అర్ధరాత్రి దారుణ హత్య.. !


పెట్రోల్..బంక్ లో అర్ధరాత్రి దారుణ హత్య.. !








నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ శివారులోని ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంకులో రామకృష్ణ(50) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి దారుణంగా హత్య చేశారు. స్థానిక పోలీసుల కథనం మేరకు.. రామకృష్ణ ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంకులో పనిచేస్తున్నాడు. ఈ

క్రమంలో సోమవారం రాత్రి విధుల్లో రామకృష్ణ ఒక్కరే ఉన్నారు. అర్ధరాత్రి వాహనాల రాకపోకలు తక్కువగా ఉండటంతో అక్కడే ఉన్న క్యాబిన్‌లో నిద్రకు ఉపక్రమించాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో రామకృష్ణపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడిలో రామకృష్ణ తీవ్ర గాయాలపాలై అక్కడే కుప్పకూలి పడిపోయాడు. తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు రామకృష్ణను గుర్తించి పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని కొన ఊపిరితో ఉన్న

రామకృష్ణను చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. రామకృష్ణను ఎవరు? ఎందుకు? హత్య చేశారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ హత్య స్థానికంగా సంచలనం కలిగించింది.


502 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon