• Neti Charithra

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే! - పీసీసి కార్యదర్శి అఘా మోహిద్దీన్!


పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే! - పీసీసి కార్యదర్శి అఘా మోహిద్దీన్!



పీలేరు: నేటి చరిత్ర



పెట్రోల్ , డీజిల్ ధరలు పెంపు కేంద్ర ప్రభుత్వ పాలనా వైఫల్యం అని పీసీసీ కార్యదర్శిపీలేరు కాంగ్రెస్ ఇంచార్జ్ అఘా మోహిద్దీన్ మండిపడ్డారు.ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో క్రూడ్ ఆయిల్ ధరలు 140 డాలరు ప్రతి బ్యారెల్ పైన ఉన్నప్పుడు మన దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు లీటరు సుమారు యాభై రూపాయలు ఉండేదని, అయినా అప్పటి అపోజిషన్ లో ఉన్న బీజేపీ పార్టీ వారు ధరలు ఎక్కువ ఉన్నాయని ప్రదర్శనలు చేసి,అహంకారంతో అప్పటి ప్రైమ్ మినిస్టర్ శ్రీ మన్మోహన్ సింగ్ గారికి గాజులు పంపించి కించపరచడం కాగా, తమ ప్రభుత్వం వస్తే ధరలు తగ్గించి లీటరు 30 రూపాయలకు తక్కువ రేట్ లో తగ్గిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్ 25 డాలర్లు కన్నా తక్కువ ఉండగా చరిత్రలో ఎన్నడూ ఈ విధముగా 17 రోజుల నుంచి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు వరుసగా పెంచిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కింది. అయితే అప్పుడు ప్రశ్నించి హామీ ఇచ్చిన వారు ఇప్పుడు ఏమయ్యారని, ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు? కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పెట్రోల్ మరియు డీజిల్ ధరల నియంత్రణ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేది.కానీ ఇప్పటి కేంద్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే పెట్రోలియం ధరలపై నియంత్రణ ప్రైవేట్ సంస్థలకు ఇచ్చినందువలన వారు వారి ప్రయోజనాల కొరకు ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచి ప్రజల నడ్డిని వీరుచుతున్నారు, దానివలన

సామాన్యుడు భయబ్రాంతులకు గురి అవుతున్నారని, చరిత్రలో ఈ విధంగా ఎన్నడు జరగలేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు కరోనా వైరస్ లాంటి పెద్ద మహమ్మారి ప్రజలను ఆర్థికంగా దెబ్బ తీస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రజలను చావ తీస్తూ గతంలో నిత్య అవసర వస్తువులు ఎన్నడూ లేనివిధంగా

ఆకాశాన్నంటుతున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ గారు 20 లక్షల కోట్లు ప్యాకేజీ ప్రకటించి ప్రజల ద్వారా ఇలా గుంజి, ఈ విధముగా ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ప్రస్తుతం ప్రజలు ఎలా బతకాలి రా బతుకు జీవుడా అని ఆశ్చర్యపోతున్నారు. మన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ మహమ్మారిని అడ్డుపెట్టుకొని, పోలీసుల తరపున ప్రజలకు మరియు సంస్థలకు నోటీసులు జారీ చేసి సభలు,ధర్నాలు, చేయరాదని ప్రజలను భయపెట్టి,పక్కదారి పట్టించి వారిని ప్రశ్నించే హక్కు లేకుండా చేసి, ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలను తీసుకుంటుంటే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గుడ్డి వాలుగా చూస్తూ వారికి ఏ మాత్రం సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నారు. కావున ప్రజలు దీనిని గుర్తించి ఆలోచించవలసిన అవసరం ఉందని ఆగ మొహిద్దీన్ గారు తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీలేరు మండల అధ్యక్షుడు ఎస్.కె మహబూబ్బాషా, డిసిసి కార్యదర్శి శ్రీ వర్ధన్ చౌదరి, పఠాన్ ఆదం, సాజిద్ మరియు తదితరులు పాల్గొన్నారు.

102 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon