• Neti Charithra

పుట్టిన బిడ్డకు .. గంటల్లోనే.. కరోనా.. వైరస్ !

పుట్టిన బిడ్డకు.. గంటల్లోనే.. కరోనా.. వైరస్ !

ఢిల్లీ: నేటి చరిత్ర (ఫిబ్రవరి5)

ఆసియా అగ్రదేశం చైనాలో మహోత్పాతం అనే స్థాయిలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ముఖ్యంగా ఇక్కడి వుహాన్ నగరంలో ఈ మహమ్మారి ధాటికి పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటివరకు అందిన గణాంకాల ప్రకారం 500 మంది వరకు మృత్యువాత పడ్డారు. వేలమంది వైరస్ సోకి ఆసుపత్రుల పాలయ్యారు. ఇక అసలు విషయానికొస్తే, ఈ వైరస్ అప్పుడే పుట్టిన బిడ్డలకు కూడా సోకుతుందని ఓ ఘటన ద్వారా వెల్లడైంది. చైనాలో ఓ పసికందు ఈ భూమ్మీద అడుగుపెట్టిన కొన్నిగంటల్లోనే కరోనా బారినపడింది. ఆ చిన్నారికి తల్లి ద్వారా వైరస్ సంక్రమించిందని డాక్టర్లు తెలిపారు. దీన్ని వెర్డికల్ ట్రాన్స్ మిషన్ అంటారని, ప్రసవానికి ముందే తల్లికి కరోనా వైరస్ సోకిందని వెల్లడించారు. అయితే, హార్బిన్ నగరంలో ఓ కరోనా బాధితురాలు బిడ్డకు జన్మనివ్వగా, ఆ బిడ్డకు వైరస్ సోకలేదని వెల్లడైంది.

58 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon